భారీగా పెరిగిన బంగారం ధరలు!

ఇప్పుడిప్పుడే సామాన్యులు సైతం బంగారాన్ని కొనగలుగుతున్న సమయంలో మళ్ళీ బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. ప్రస్తుతం నగల తయారీలో వినియోగించే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు హైదరాబాద్ మార్కెట్లో రూ.44,800గా అందుబాటులో ఉంది. నిన్నటితో పోల్చితే రూ.100 పెరిగింది. హైదరాబాద్‌లో ఒక్క గ్రాము బంగారం రూ.4,480కి లభిస్తోంది.

మార్కెట్లో లభించే 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారాన్ని వ్యాపారులు ఎక్కువగా పెట్టుబడుల్లో వినియోగిస్తారు. ఈ బంగారం 10 గ్రాముల ధర హైదరాబాద్‌లో రూ.48,880గా ఉంది. నిన్నటితో పోల్చితే రూ.120 పెరిగింది. ఒక్క గ్రాము ప్యూర్ గోల్డ్ రేటు హైదరాబాద్‌లో రూ.4,888కి లభిస్తోంది.

హైదరాబాద్, విశాఖ, విజయవాడలో 22 క్యారెట్ల బంగారం తులం ధర రూ.44,800గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,880గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 45,000గా ఉంది. అదే 24 క్యారెట్ల పసిడి ధర రూ.49,010కి లభిస్తోంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం తులం ధర 46,940గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర 48,940 పలుకుతోంది.

న్యూఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం తులం ధర రూ.46,950, 24 క్యారెట్ల బంగారం రేటు రూ.51,120 పలుకుతోంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.47,100, 24 క్యారెట్ల బంగారం రేటు 49,800గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం రేటు రూ.44,800 పలుకుతోంది. అదే 24 క్యారెట్ల బంగారం రూ.48,880కి లభిస్తోంది.

గడిచిన 10 రోజుల్లో బంగారం రేటు ఐదు సార్లు తగ్గింది. మరో నాలుగు సార్లు పెరిగింది. ఒకసారి మాత్రం స్థిరంగా ఉంది. ఐతే బంగారం ధరల్లో అస్థిరత కనిపిస్తోంది. కొన్ని రోజులు తగ్గుతూ..మరికొన్ని రోజులు పెరుగుతోంది.

బంగారం ధర పెరిగితే.. వెండి మాత్రం భారీగా తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో తులం వెండి రూ.610గా ఉంది. నిన్నటితో పోల్చితే 10 గ్రాములు వెండి రేటు రూ.36 తగ్గింది. అదే కేజీ వెండి రూ.61,000కి లభిస్తోంది. హైదరాబాద్ నగరంలో ఒక్క గ్రాము ధర రూ.61 పలుకుతోంది.

హైదరాబాద్, విజయవాడ, విశాఖ, చెన్నై, కేరళలో తులం వెండి ధర ఒకేలా ఉంది. ఆయా నగరాల్లో తులం వెండి రూ.610కి లభిస్తోంది. ఇక ముంబై, న్యూఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, పుణె, బరోడాలో రూ.650కి అందుబాటులో ఉంది. గత 10 రోజుల్లో వెండి ధరలు ఏకంగా ఆరు సార్లు తగ్గాయి. మూడు సార్లు పెరిగాయి. ఒకసారి మాత్రం స్థిరంగా ఉంది. వెండి ధరలు కాస్త దిగి రావడం శుభపరిణామం.

బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులకు ఎన్నో కారణాలు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలలో పెరుగుదల, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ తగ్గడం, ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పు, వివిధ జువెలరీ మార్కెట్లలో డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి.

gold prices
increased gold prices

Leave a comment

Your email address will not be published.