logo

సింపుల్ అండ్ టేస్టీగా ఉండే పల్లీ నూడుల్స్‌


07-Jan-2020 21:13IST
simple and tasty palli noodles

ప్రస్తుత మోడ్రన్ ప్రపంచంలో నిత్యం బిజీగా ఉండే మన జీవనశైలిలో ఫాస్ట్ ఫుడ్ ను ఎక్కవుగా ఇష్టపడుతుంటారు. అలాగే ఎక్కవగా తింటుంటారు కూడా. అంతే కాకండా మన జీవితం అనేక రకాల మార్పులతో పాటు, ఆహారపు అలవాట్లలో కూడా కొత్తదనాన్ని కోరుకుంటున్నాయి . అందుకే ఫాస్ట్ ఫుడ్స్ అంటే అంతే క్రేజ్. ఫాస్ట్ ఫుడ్స్ బాగా పాపులర్ అయినాయి. ఫాస్ట్ ఫుడ్స్ లో టేస్టీ ఫుడ్స్ లో నూడిల్స్ కూడా ఒకటి. నూడిల్స్ ను వివిధ రకాలుగా తయారుచేసుకుంటారు. ఈ రోజు మీకోసం ఒక సింపుల్ అండ్ టేస్టీగా ఉండే పల్లీ నూడుల్స్‌ ఎలా..? తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..! 

కావలసిన పదార్థాలు :
నూడుల్స్‌- 2 కప్పులు, చికెన్‌- పావు కిలో, సన్నగా తరిగిన గుమ్మడికాయ ముక్కలు- అర కప్పు, ఉల్లిపాయ- 1, క్యారెట్‌- 2, గుడ్లు- 2, వేగించిన పల్లీలు- అర కప్పు, సోయాసాస్‌- 3 టేబుల్‌ స్పూన్లు, వెనిగర్‌- ఒక టేబుల్‌ స్పూను, చిల్లీసాస్‌- ఒక టేబుల్‌ స్పూను, కొత్తిమీర- కొద్దిగా, నూనె- 2 టేబుల్‌ స్పూన్లు, కారం, ఉప్పు- తగినంత.

తయారు చేసే విధానం : 
నూడుల్స్‌ను వేడినీటిలో వేసి రెండు నిమిషాల తర్వాత తీసి ఆరబెట్టాలి. చికెన్‌ను ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బాణలిలో ఒక టేబుల్‌ స్పూను నూనె పోసి వేడెక్కాక క్యారెట్‌, ఉల్లిపాయ, గుమ్మడికాయ ముక్కలు వేసి మూడు నిమిషాలు వేగించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మరో బాణలిలో ఒక టేబుల్‌ స్పూను నూనె పోసి వేడెక్కాక నూడుల్స్‌ వేసి వేగించాలి. తర్వాత సోయాసాస్‌, చిల్లీసాస్‌, వెనిగర్‌ వేసి నిమిషం పాటు వేగించాలి. తర్వాత గుడ్లు పగులకొట్టి వేసి ఉప్పు, కారం కూడా వేసి మరో అరనిమిషం పాటు వేగించాలి. ఆ తర్వాత పక్కనపెట్టుకున్న చికెన్‌, క్యారెట్‌, ఉల్లిపాయ, గుమ్మడికాయ ముక్కలు వేసి 2 నిమిషాలు వేగించాలి. చివరగా పల్లీలు వేసి మరో 2 నిమిషాలు వేగించి కొత్తిమీర జల్లి దించేయాలి.


Image result for noodles with ground nuts

Tags: simple tasty palli noodle

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top