logo

మైమరపించే మసాలా టీ


08-Jan-2020 21:26IST
the mesmerizing masala tea

ప్రపంచవ్యాప్తంగా మంచినీటి తర్వాత ఎక్కువ మంది 'టీ' నే త్రాగుతుంటారు. ముఖ్యంగా చెప్పాలంటే  మన దేశంలో టీ లవర్స్ కోట్లలో ఉన్నారంటే అతిశయోక్తే కదా..! పైగా... మన దేశం నుంచీ చాలా దేశాలకు టీ ఎగుమతి అవుతోంది. అసోం, డార్జిలింగ్ టీలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఐరోపా దేశాల్లో టీ కంపెనీలు తమ ప్రతినిధులను ఇండియాకి పంపి... టీ ఎస్టేట్ ఓనర్లతో డీల్స్ కుదుర్చుకుంటాయి. అంతలా మన దేశపు టీ కోసం ప్రపంచ దేశాలు ఆసక్తి చూపిస్తాయి. ఇక ఇండియాలో అత్యంత సంపన్నుల నుంచీ అంత్యంత పేదల వరకూ అందరూ టీని ఎంతో ఇష్టంగా తాగుతారు. ఎందుకంటే..? మనకు ఎన్ని టెన్షన్స్ ఉన్న సరే ఒక్క కప్పు టీ త్రాగితే చాలు.. వెంటనే శక్తిని పుంజుకుంటాము. అలాంటి టీలు మనకు ఎన్నో రకాలుగా లభ్యమవుతున్న మసాలా టీ అంటే మాత్రం అందరికి ప్రీతీ. మరీ అదెలా తయారు చేస్తారో తెలుసుకుందామా..! 

కావాల్సిన పదార్థాలు : 
పాలు - 2 కప్పులు, నీళ్లు - 1/2 కప్పు, యాలకులు - 2, జాజికాయ - 1, మిరియాలు - కొద్దిగా, దాల్చిన చెక్క - 1, అల్లం - ఒక చిన్న ముక్క, టీ పొడి - 1/4 స్పూను,

తయారు చేసే విధానం :

 ముందుగా పాలు పోసి, కొద్దిగా నీళ్లు కూడా వేసుకుని అందులో, టీపొడి, పంచదార వేసుకుని బాగా మరిగించాలి. ఈ మిశ్రమం పొంగుతున్నప్పుడు అందులో పైన చెప్పిన మసాలా దినుసుల్ని పొడిగా తయారు చేసుకోవాలి. అల్లం విడిగా దంచుకుని టీ పొంగతున్నప్పుడు ఇవన్నీ వేసి బాగా మరిగించుకోవాలి. అంతే మసాలా టీ రెడీి



Related image

Tags: mesmerizing masala tea

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top