logo

ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్


09-Jan-2020 12:16IST
budget release on february 1st

న్యూఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు కేంద్రం రెడీ అవుతోంది. అయితే బడ్జెట్ సమావేశాలను రెండు దశల్లో నిర్వహించాలని కేంద్రం ఆలోచిస్తోంది. బడ్జెట్‌ సెషన్‌ను జనవరి 31 నుంచి ఏప్రిల్‌ 3 వరకు రెండు దశల్లో నిర్వహించాలని పార్లమెంటరీ వ్యవహారాలపై క్యాబినెట్‌ కమిటీ (సీసీపీఏ) సిఫార్సు చేసింది. తొలి దశను జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు, రెండో దశను మార్చి 2 నుంచి ఏప్రిల్‌ 3 వరకు పేర్కొన్నట్లు బుధవారం సంబంధిత వర్గాలు వెల్లడించాయి. రెండు దశల మధ్య సాధారణంగా నెల రోజుల విరామం ఉంటుంది. బడ్జెట్‌లో వివిధ శాఖలకు కేటాయించిన నిధులను ఈ కాలంలో పార్లమెంటరీ కమిటీలు పరిశీలించనున్నాయి. అయితే ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‎లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 

Tags: budget release on february 1st

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top