logo

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!


10-Jan-2020 08:57IST
gold rates decreased in hyderabad

పసిడి ప్రియులకు ఇది పండుగలాంటి శుభవార్త.. ఎందుకంటే ఎప్పుడు తగ్గుతూ పెరుగుతూ ఉన్న ఈ బంగారం ధరలు ఈరోజు దారుణంగా పతనమయ్యాయి. దీంతో నేడు హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,070 రూపాయిల తగ్గుదలతో 41,790 రూపాయల వద్దకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 970 రూపాయిల తగ్గుదలతో 38,300 రూపాయలకు చేరింది. 

బంగారం ధర భారీగా తగ్గగా వెండి ధర కూడా దానికి మించి తగ్గింది. దీంతో హైదరాబాద్ మార్కెట్ లో నేడు కేజీ వెండి ధర 1500 రూపాయిల తగ్గుదలతో 49,350 రూపాయలకు క్షిణించింది. అయితే బంగారంపై ఇలా ప్రతికూల ప్రభావం చూపడానికి కారణం అంతర్జాతీయంగా కొనుగోలు దారుల నుంచి డిమాండ్ భారీగా తగ్గింది అని చెప్తున్నారు మార్కెట్ నిపుణులు. మరి ఈ ధరలు ఇలాగె తగ్గుతాయో లేక పెరుగుతాయో చూడాలి. 

Tags: gold rates silver rates hyderabad

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top