logo

లోపాన్ని ఆయుధంగా మార్చుకొన్న‌ హాకింగ్ కు నివాళి


10-Jan-2020 15:11IST
hawking who turned his own error into a weapon

"అన్ని అవయవాలు బాగున్నా లేని లోపాలు ఊహించుకొని ఏమీ సాధించలేమని భాదపడిపోతుంటారు చాలామంది ప్రజలు.కాని కదలడానికి సహకరించని శరీరం,చక్రాల కుర్చీకే పరిమితమైన జీవనం,మాట్లాడటానికి కూడా కంప్యూటరే ఆధారం , మోతార్ న్యురాన్ అనే భయంకరమైన వ్యాధి శరీరాన్ని కబలిస్తున్న చలించక తనలోని లోపాన్ని ఆయుధంగా మార్చుకొని కృష్లబిలాలు పై (dark holes)ప్రయోగాలు చేస్తూ ఎంతో విలువైన సమాచారాన్ని కనుగొంటున్నాడు ఒక ఆదర్శవంతుడు అతని పేరే స్టీఫెన్ విలియం హాకిన్స్ ,గొప్ప బౌతిక సైదాంతిక శాస్త్రవేత్త.

 ఈ సృష్టి వారం రోజులలో జరగలేదు. అసలు సృష్టికర్త అనే వారే లేరు. స్వర్గం-నరకం లేవు.మరుజన్మ కూడా లేదు.- ఈ యేటి మేటి శాస్త్రవేత్త స్టీఫెన్ విలియం హాకింగ్ .    అసలు కృష్ణ బిలం అంటే ఏమిటి?? అనంత విశ్వంలో భయకరమైన నల్లని బిలాలు వున్నాయి. నక్షత్రాలు ఈ బిలాలలోనికి చేరినప్పుడు ఆశ్చర్యంగా తమ కాంతిని కోల్పోయి అంతర్థానం అయిపోతున్నాయి.దీనికి కారణం చాలా మంది శాస్త్రవేత్తలకు అర్థంకాలేదు.1970 లో క్వాంటమ్ థియరీ,జనరల్ రిలేటివిటీ లను ఉపయోగించి కృష్ణబిలాలు రేడియోషన్స్ ను వెలువరిస్తాయని కనుగొన్నాడు.వీటినే హాకింగ్స్ రేడియన్స్ గా పిలుస్తారు.1971 లో బిగ్ బ్యాంగ్ థియరీ మీద అనేక పరిశోధనలు చేసి ఎంతో విలువైన విషయాలను కనుగొన్నాడు. 1984 లో ఏ బ్రీఫ్ హిస్టరీ ఆప్ టైమ్ అనే పుస్తకాన్ని రచించారు.ఇది అతి తక్కువ సమయంలోనే అత్యథికంగా అమ్ముడైన పుస్తకంగా రికార్డు సృష్టించి గిన్నీస్ బుక్ లోకి ఎక్కింది.

 అలాగే జీవన మరణాల గురించి ఇలా చెబుతాడు హాకిన్స్ "మరణం తరువాత జీవనం లేదు. స్వర్గం నరకం అనేవి పిరికివారిని భయపెట్టడానికి అల్లిన కట్టుకతలు.  మన శరీరం కూడా కంప్యూటర్ లాంటిదే .దానిలో అనేక భాగాలుంటాయి. అవన్నీ పనిచేయడం మానేస్తే ఇంక ఇది పని చేయదు. అలాగే మనశరీరంలోని అవయవాలన్నీ ఒక్కొక్కటి పనిచేయడం ఆగిపోతే చివరికి మెదడు కూడా పనిచేయడం మానేస్తుంది..ఇదే మరణం..దీనికోసం అందరూ ఎదురుచూడాల్సిందే.

 ఫ్రెండ్స్ 1962 తన 20 వ యేట వచ్చిన ఈ భయంకర వ్యాధి తో 56 సంవత్సరాలు జీవించాడంటే  అతని ధృఢసంకల్పం, ఆత్మవిశ్వాసం ఎంతగొప్పదో ఊహించండి. ఈ వ్యాధి సోకినప్పుడు కొన్ని నెలలకంటె ఎక్కువ బతకడు అన్న డాక్టర్ల మాటలకు వ్యతిరేఖంగా ఏకంగా 56సంవత్సరాలు జీవించడం అద్బుతం. ..మోతార్ న్యురాన్ వ్యాధి అంటే నరాలు పనిచేయక మెదడు కి శరీరానికి మధ్య సమన్వయం కోల్పోయి శరీరం మొద్దుబారిపోతుంది..ప్రతి యొక్క విద్యార్థి హాకిన్స్ ను ఆదర్శంగా తీసుకోవాలి. 
  
"ఈ రోజు స్టీఫెన్ హాకింగ్ జయంతి..ఒక పోరాటయోధుడికి నివాళులు!!!! .... అయితే మన ప్రాంతీయత, మనం పెరిగే వాతావరణం.. మనలో భయమే దయ్యం.. మనలో మంచి దైవం ఇలా ముందుకు సాగుతాం.

Tags: hawking scientist own error weapon

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top