logo

వారాంతంలో లాభాల ముగింపు


10-Jan-2020 17:00IST
stock markets gains end of the weekend

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ముగించాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గుతున్న నేపథ్యంలో దేశీయ మార్కెట్లు నేడు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభం లాభాలను మిడ్‌ సెషన్‌లో కోల్పోయిన సూచీలు చివరి అర్థగంటలో భారీగా పుంజుకుని వరుసగా రెండో రోజు లాభాలను మూటగట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్‌147 పాయింట్లు లాభపడి, 41599, నిఫ్టీ 41 పాయింట్లు లాభపడి 12257 వద్ద ముగిసాయి. దాదాపు అన్ని రంగాలు లాభ పడ్డాయి. ముఖ్యంగా బ్యాంకింగ్‌, ఆటో రంగాలు పాజిటివ్‌గా ముగిసా​యి.  ఇన్ఫోసిస్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌  మారుతి సుజుకి, ఏసియన్‌ పెయింట్స్‌, సన్‌ఫార్మ, కోటక్‌ బ్యాంక్‌, ఐటీసీ, ఎం అండ్‌ ఎం లాభ పడ్డాయి. యస్‌బ్యాంకు,  జీ,  ఐసీఐసీఐ, ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు, టైటన్‌, విప్రో,  యూపీఎల్‌, భారతి ఎయిర్‌టెల్‌ టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి. 





Related image

Tags: stock markets sensex gains end of the weekend

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top