logo

కేవలం 59నిమిషాల్లో బ్యాంకు లోన్ పొందడం ఎలా..?


10-Jan-2020 19:54IST
how to get a bank loan in just 59 minutes

మనలో చాలా మందికి సొంత ఇల్లు కట్టుకోవాలని, బిజినెస్ పెట్టుకోవాలని, వెహికల్ కొనాలనే ఆశ ఉంటుంది. అందుకోసం మనం రుణం తీసుకునేందుకు కొన్ని బ్యాంకులను ఆశ్రయిస్తుంటాము. ఈ క్రమంలో లోన్ మంజూరు కావడానికి రోజుల తరబడి సమయం వేచి చూడాల్సి వచ్చేది కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. ఇలా బ్యాంకు నుంచి ఏదైనా రుణం తీసుకోవాలని అనుకున్నవారికి కేవలం 59 నిమిషాల్లో లోన్ సాంక్షన్ అవుతుంది. 

ఇదెలా సాధ్యం అనుకుంటున్నారా? PSBloansin59minutes.com వెబ్‌సైట్‌తో ఇది సాధ్యమే. గతంలో ఈ వెబ్‌సైట్ ద్వారా కేవలం బిజినెస్ లోన్స్ మాత్రమే లభించేవి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు(MSMEs) కేవలం 59 నిమిషాల్లో రుణాలు మంజూరు అవుతాయి. ఈ ప్లాట్‌ఫామ్ సక్సెస్ కావడంతో హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్, ఆటో లోన్స్ కూడా ప్రారంభమయ్యాయి. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా కస్టమర్లు ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి 59 నిమిషాల్లోనే రుణాలు మంజూరు చేయించుకోవచ్చు. మీరు పర్సనల్ లోన్ లేదా హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటే PSBloansin59minutes.com వెబ్‌సైట్‌‌లో రిజిస్టర్ చేసుకొని రుణాలకు దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వ రంగ బ్యాంకులు మీకు కేవలం 59 నిమిషాల్లో లోన్ మంజూరు చేస్తాయి. 






Related image
ఇందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్‌ బ్యాంక్ సహా 19 ప్రభుత్వ రంగ బ్యాంకులు PSBloansin59minutes.com ద్వారా పర్సనల్ లోన్, హోమ్ లోన్, ఆటో లోన్ ఇస్తున్నాయి. మీ క్రెడిట్ స్కోర్, బ్యాంక్ స్టేట్‌మెంట్, ఆదాయపు పన్ను చెల్లింపులు లాంటి అంశాలను ఆల్గరిథమ్ ద్వారా విశ్లేషించి రుణాలు మంజూరు చేయడం ఆన్‌లైన్ లెండింగ్ ప్లాట్‌ఫామ్‌ ప్రత్యేకత.  ఈ వెబ్‌సైట్‌‌ను 2018లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు(MSMEs) ప్రభుత్వ రంగ బ్యాంకులు 59 నిమిషాల్లోనే వ్యాపార రుణాలు మంజూరు చేయడమే లక్ష్యంగా ఈ ప్లాట్‌ఫామ్ పనిచేసింది. 

Tags: get a bank loan 59 minutes

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top