logo

బడ్జెట్ లో రియల్‌మీ 5ఐ రిలీజ్


10-Jan-2020 20:30IST
budget smartphone realmi 5I release

ఈ కొత్త ఏడాది సరికొత్తగా ఉండేందుకు ప్రతి మొబైల్ కంపెనీ సంస్థలు పోటీ పడి మరీ కొత్త మొబైల్ ఫోన్లను మార్కెట్‌లోకి వదిలేందుకు సిద్ధం అవుతున్నాయి. ఈ దూకుడులో షావోమీ, రియల్ మీ వంటి చైనీస్ మొబైల్స్‌తో పాటు శాంశంగ్, ఐఫోన్, మోటో వంటి పెద్ద కంపెనీలు కూడా పోటీకి దిగాయి. ఈ క్రమంలో ఇండియన్ స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ మార్కెట్‌లో తన దూకుడు కొనసాగిస్తోంది. వరుసగా స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేస్తూ యూజర్లను కన్‌ఫ్యూజ్ చేస్తోంది. రియల్‌మీ 5 సిరీస్‌లో ఇప్పటికే రియల్‌మీ 5 ప్రో, రియల్‌మీ 5, రియల్‌మీ 5ఎస్ రిలీజ్ చేసిన కంపెనీ... ఇప్పుడు బడ్జెట్ సెగ్మెంట్‌పై గురిపెట్టింది. తక్కువ ధరలో రియల్‌మీ 5ఐ రిలీజ్ చేసింది.

ప్రస్తుతం మార్కెట్లో హల్ చల్ చేస్తున్న షావోమీ బ్రాండ్ రెడ్‌మీ 8 మోడల్‌ను టార్గెట్ చేస్తూ రియల్‌మీ 5ఐ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.8,999 మాత్రమే. ఈ ఫోన్ ఇప్పటికే వియత్నాంలో లాంఛైంది. ఇప్పుడు ఇండియాకు వచ్చింది. ఇండియాలో జనవరి 15న మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌తో పాటు రియల్‌మీ అఫీషియల్ వెబ్‌సైట్‌లో సేల్ మొదలవుతుంది. రిలయెన్స్ జియో యూజర్లకు రూ.7,550 విలువైన బెనిఫిట్స్ లభిస్తాయి. దాంతో పాటు క్యాషిఫై, మొబీక్విక్ నుంచి ఆఫర్స్ ని కూడా ఇవ్వనుంది. 

రియల్‌మీ 5ఐ ఫీచర్స్: 
డిస్‌ప్లే: 6.52 అంగుళాలు
ర్యామ్: 4జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 665రియర్ కెమెరా: 12+8+2+2 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా
ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్
బ్యాటరీ: 5000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: కలర్ ఓఎస్ 6.0.1+ఆండ్రాయిడ్ 9 పై
కలర్స్: ఆక్వా బ్లూ, ఫారెస్ట్ గ్రీన్
ధర:
4జీబీ+64జీబీ- రూ.8,999.




Image result for realme 5i




Tags: budget smartphone realmi 5I release

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top