logo

ఎగిరేపళ్లెం ఉందంటున్న యూఫాలజిస్టులు


10-Jan-2020 21:19IST
euphorologists says there are ufos

గ్రహాంతర వాసులు అంతరిక్షంతోపాటూ... మన భూమిపైనా ఉన్నారన్నది యూఫాలజిస్టుల వాదన. తాజాగా ఓ ఆధారాన్ని వారు తెరపైకి తెచ్చారు. 2014లో అమెరికా లాస్‌ఏంజిల్స్‌లో ఓ ఎగిరేపళ్లెం నిలిపి ఉంచారని వార్తలు వెల్లువెత్తినప్పటికీ అవి అవాస్తవాలని కొట్టిపడేసిన నాసా జెట్‌ ప్రపల్షన్‌ లెబొరాటరీ ఇప్పడు మరో విషయాన్ని సస్పెన్స్ లోకి నెట్టిపడేసింది.  తాజగా ఏలియన్స్‌పై పరిశోధనలు చేసే ప్రైవేట్ వెబ్‌సైట్ యూఎఫ్ఓ సైటింగ్స్ డైలీ తాజాగా మరో ఎగిరే పళ్లెంని కనుగొన్నారు.  
అది భూమి చుట్టూ తిరుగుతున్న షటిల్ అట్లాంటిస్ కింద ఉందని ఆ వెబ్‌సైట్ నిర్వాహకుడు స్కాట్ వారింగ్ చెబుతున్నారు. 

ఈ క్రమంలో నాసా దాన్ని ఓ శాటిలైట్ అని చెబుతోందనీ... కానీ... దీనితోపాటూ... ఇలాంటి ఫొటోల్లో తాను మరిన్ని ఎగిరే పళ్లేలను కనిపెట్టానని స్కాట్ అంటున్నారు. ఈ ఎగిరే పళ్లేన్ని నాసా తప్పుగా శాటిలైట్ అని చెబుతోందనీ... షటిల్ అట్లాంటిస్ చుట్టూ చాలా 'యూఎఫ్ ఓ' తిరిగిన విషయం యూఫాలజిస్టులు అందిరికీ తెలుసని ఆయన చెబుతున్నారు. ఈ ఎగిరే పళ్లాల వల్లే... అట్లాంటిస్ షటిల్ ల్యాండిగ్ ఆలస్యమైందనీ... అన్ని  'యూఎఫ్ ఓ'లూ వెళ్లిన తర్వాతే... షటిల్‌ను ల్యాండ్ చేశారనీ ఆయన తన వాదనను బలపరుస్తూ చెబుతున్నారు. ఇప్పటికే స్కాట్ ఇలాంటి వేల కొద్దీ 'యూఎఫ్ ఓ'లను గుర్తించినట్టు గతంలో చాలా వార్తలు వినిపించాయి. ఐతే... ఆయన గుర్తించిన 'యూఎఫ్ ఓ'లను నాసా అవి నిజమైనవి కావని తేల్చి చెప్పింది.



Tags: euphorologists says there are ufo's

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top