logo

మూడో టీ-20లో లంకఫై భారత్ ఘన విజయం


11-Jan-2020 07:33IST
india won in the third t20 on srilanka

సీజన్స్ మారినా ఇండియా ఆధిపత్యంలో ఎలాంటి మార్పు లేదు అనేందుకు లంకను చిత్తుగా ఓడించడమే అందుకు నిదర్శనం. ప్రయోగాలు చేసినా ఫలితంలో తేడా రావడం లేదు.. గతేడాది ఎదురైన జట్టునల్లా చిత్తు చేసిన కోహ్లీసేన కొత్త ఏడాదిలోనూ అదే జోరు కొనసాగించింది. ఎందులోనూ భారత్ కి సరితూగని శ్రీలంకను  వరుసగా రెండో టీ20లోనూ చిత్తుగా ఓడించి సిరీస్‌‌ను చేజిక్కించుకున్నారు. పవర్‌‌ఫుల్‌‌ బ్యాటింగ్‌‌.. పదునైన బౌలింగ్‌‌.. మెరుపు ఫీల్డింగ్‌‌తో పుణె వేదికగా లంకేయులను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఓపెనర్‌‌ స్లాట్‌‌లో బరిలోకి దిగేందుకు పోటీ పడుతున్న శిఖర్‌‌ ధవన్‌‌, లోకేశ్‌‌ రాహుల్‌‌ చెరో హాఫ్‌‌ సెంచరీతో  చెలరేగగా..   క్రీజులో ఉన్నది  కొద్దిసేపే అయినా కెప్టెన్‌‌ కోహ్లీ బ్యాటింగ్‌‌తో అందరిని ఆకట్టుకున్నాడు.. పెండ్లైన త్వరాత ఫస్ట్‌‌ మ్యాచ్‌‌ ఆడిన మనీశ్‌‌ పాండే పరుగుల మెరుపులు మెరిపిస్తే..  నేనేం తక్కువా అన్నట్టు పేసర్‌‌ శార్దుల్‌‌ ఠాకూర్‌‌ కూడా దంచికొట్టడంతో ఇండియా భారీ స్కోర్ ని సాధించింది. ఆపై పేసర్లు నవ్‌‌దీప్‌‌, శార్దుల్‌‌, బుమ్రాతో పాటు సుందర్‌‌ పోటాపోటీగా లంక వికెట్లు పడగొట్టడంతో ఏ దశలోనూ  పోటీ ఇవ్వలేకపోయిన లంకేయులు  ఘోర పరాజయం పాలయ్యారు ..!

ఈ నూతన సంవత్సరంలో భారత్.. శ్రీలంకతో ఆడిన మూడు టీ20ల సిరీస్‌‌ను 2–0తో కైవసం చేసుకుంది. పూణే వేదికగా.. ఎమ్‌‌సీఏ స్టేడియంలో శుక్రవారం జరిగిన మూడో, చివరి మ్యాచ్‌‌లో కోహ్లీసేన  78 పరుగుల తేడాతో గ్రాండ్‌‌ విక్టరీ సాధించింది.  లోకేశ్‌‌ రాహుల్‌‌ (36 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్‌‌తో 54), శిఖర్‌‌ ధవన్ (36 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్‌‌తో 52) హాఫ్‌‌ సెంచరీతో రాణించడంతో మొదట బ్యాటింగ్‌‌ చేసిన ఇండియా 20 ఓవర్లలో  ఆరు వికెట్లకు 201 పరుగుల భారీ స్కోరు చేసింది. మనీశ్‌‌ పాండే (18 బంతుల్లో 4 ఫోర్లతో 31 నాటౌట్‌‌), విరాట్‌‌ కోహ్లీ (17 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌‌తో 26)తో పాటు చివర్లో శార్దుల్‌‌ ఠాకూర్‌‌ (8 బంతుల్లో 1 ఫోర్‌‌, 2 సిక్సర్లతో 22 నాటౌట్‌‌) సత్తా చాటాడు. ఛేజింగ్‌‌లో ఇండియా కట్టుదిట్టమైన బౌలింగ్​ ధాటికి లంక 15.5 ఓవర్లలో 123 రన్స్‌‌కే ఆలౌటైంది. ధనంజయ డిసిల్వ (57), ఏంజెలో మాథ్యూస్‌‌ (31) మాత్రమే పోరాడారు. నవ్‌‌దీప్‌‌ సైనీ (3/28) మూడు,  శార్దుల్‌‌ ఠాకూర్ (2/19), సుందర్‌‌ (2/37)  రెండేసి వికెట్లు తీశారు. శార్దుల్‌‌ ఠాకూర్‌‌కు మ్యాన్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌,  సైనీకి మ్యాన్‌‌ ఆఫ్‌‌ ద సిరీస్‌‌ అవార్డులు దక్కాయి.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

indian-team





Tags: team india sriLankateam pune india won third t20 srilanka

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top