logo

ఏపీ సచివాలయాల్లో 16,207 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల


11-Jan-2020 08:18IST
notification to replace 16207 jobs in ap ministries

ఏపీలోని నిరుద్యోగ యువత కోసం జగన్ ప్రభుత్వం శుభవార్త మోసుకొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో 16,207 ఉద్యోగాల భర్తీకి పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌ తాజాగా నోటిఫికేషన్‌ విడుదల చేశారు. వీటిలో 14,061 గ్రామ సచివాలయ పోస్టులు ఉండగా.. 2,146 వార్డు సచివాలయ పోస్టులు ఉన్నాయి. 

సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు నేటి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి 31 అర్ధరాత్రి వరకు దరఖాస్తుకు సమయం ఇచ్చారు. గతఏడాది రాష్ట్రంలో 1.34 లక్షల సచివాలయ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసిన విషయం తెలిసిందే. వాటిలో మిగిలిన ఉద్యోగాలతోపాటు.. ఆ నోటిఫికేషన్లలో పోస్టుల వారీగా పేర్కొన్న విద్యార్హతలే తాజా నోటిఫికేషన్‌కు కూడా వర్తిస్తాయని అధికారులు తెలిపారు.

సర్వీసులో ఉన్న అభ్యర్థులకు కొన్ని ఉద్యోగాల విషయంలో 10 శాతం మార్కుల వెయిటేజీ ఇవ్వనున్నట్లు సమాచారం. రాతపరీక్ష ద్వారానే గ్రామ సచివాలయాల్లోని పోస్టులను భర్తీ చేయనున్నారు. మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో రాతపరీక్షలు నిర్వహించనున్నారు. అవసరాలకు అనుగుణంగా నోటిఫికేషన్‌లో పేర్కొన్న పోస్టుల సంఖ్య పెరిగే వీలుందని అధికారులు పేర్కొన్నారు.

మొత్తం ఖాళీల సంఖ్య: 16,207

గ్రామ సచివాలయ పోస్టుల వివరాలు:

పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-5 61
వీఆర్వో గ్రేడ్-2 246
ఏఎన్‌ఎం గ్రేడ్-3 648
విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ 69
విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ 1782
విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గ్రేడ్-2 536
విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ 43
విలేజ్ వెల్ఫేర్ సెక్రటరీ 762
ఇంజినీరింగ్ అసిస్టెంట్ 570
డిజిటల్ అసిస్టెంట్ 1134
విలేజ్ సర్వేయర్ గ్రేడ్-3 1255
వెల్ఫేర్ & ఎడ్యుకేషన్ అసిస్టెంట్ 97
వెటర్నరీ అసిస్టెంట్ 6,858

వార్డు సచివాలయ పోస్టుల వివరాలు:

వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ `105
వార్డు అమినిటీస్ (వసతుల) సెక్రటరీ 371
వార్డు శానిటేషన్, ఎన్విరాన్‌మెంట్ సెక్రటరీ 513
వార్డు ఎడ్యుకేషన్, డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ 100
వార్డు ప్లానింగ్, రెగ్యులేషన్ సెక్రటరీ 844
వార్డు వెల్ఫేర్, డెవలప్‌మెంట్ సెక్రటరీ 213







Image result for సచివాలయాల్లో 16,207 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌

Tags: andhra pradesh ap grama sachivalayam job notification

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top