logo

ఆర్డినెన్స్ ఎక్విప్‌మెంట్ ఫ్యాక్టరీల్లో.. 6 వేలకు పైగా ఉద్యోగాలు


11-Jan-2020 11:21IST
over 6000 jobs in ordnance equipment factories

దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న నిరుద్యోగ యువత కోసం భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖ శుభవార్తను తీసుకొచ్చింది. దీని పరిధిలో గల ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు దేశవ్యాప్తంగా ఉన్న ఆర్డినెన్స్ & ఆర్డినెన్స్ ఎక్విప్‌మెంట్ ఫ్యాక్టరీల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఖాళీల భర్తీకి సంబంధించి జనవరి 10న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. పదోతరగతి, ఐటీఐ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

మొత్తం ఖాళీలు: 6,066

ఐటీఐ కేటగిరీలో: 3847
నాన్-ఐటీఐ కేటగిరీలో : 2219
మొత్తం ఖాళీల సంఖ్య: 6,066

విద్యార్హతలు: 
నాన్-ఐటీఐ కేటగిరీకి కనీసం 50 శాతం మార్కులతో పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. మ్యాథ్స్, సైన్స్‌ సబ్జెక్టుల్లో కనీసం 40 శాతం మార్కులు ఉండాలి. ఐటీఐ కేటగిరీకి సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి..
అభ్యర్థుల వయసు09.02.2020 నాటికి 15-24 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు, ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: మెరిట్ ఆధారంగా. ఐటీఐ, నాన్-ఐటీఐ విభాగాలకు వేర్వేరుగా ఎంపిక జాబితాను ప్రకటిస్తారు. ఎంపికైనవారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్ష నిర్వహిస్తారు.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ: 10.01.2020.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 09.02.2020



Image result for 6,000 jobs, ordnance equipment factories


Tags: 6 000 jobs ordnance equipment factories

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top