logo

శ్రీవారి ఆభరణాల చోరీ కేసుపై తాజావార్త..!


11-Jan-2020 11:45IST
news update on srivari jeweler

ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల శ్రీవారి ఆలయంలో లక్షల విలువైన నగలు మాయమైన ఘటన అప్పట్లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దేవస్థానం ట్రెజరీ నుంచి స్వామి వారి నగలు మాయమైన మాట వాస్తవమేనని విచారణ కమిటి నిర్ధారించినట్లు తెలుస్తుంది. 2016లో తిరుపతి పరిపాలనా భవనం ట్రెజరీ ఏఈవోగా శ్రీనివాసులు ఉన్న సమయంలో ఏడు లక్షలకు పైగా విలువ చేసే శ్రీవారి ఆభరణాలు మాయమైనట్టు ఆరోపణలు వచ్చాయి. శ్రీనివాసులను బాధ్యుడిగా పేర్కొంటూ 2018 నవంబర్ నుంచి అతని జీతంలో నుంచి రూ.25వేలు కట్ చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం శ్రీనివాసులు నుంచి జరిమానా వసూలును కొనసాగించడంతో పాటు శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం అందుతుంది. 

Image result for tirupati, srivari jewellers theft

Tags: tirupathi srivaru

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top