logo

రాహుల్ ఫై వేటు తప్పెనా..! ?


12-Jan-2020 08:07IST
may be rahul is not going to play australia series

సీజన్స్ మారినా ఇండియా ఆధిపత్యంలో ఎలాంటి మార్పు లేదు అనేందుకు లంకను చిత్తుగా ఓడించడమే అందుకు నిదర్శనం. ప్రయోగాలు చేసినా ఫలితంలో తేడా రావడం లేదు.. గతేడాది ఎదురైన జట్టునల్లా చిత్తు చేసిన కోహ్లీసేన కొత్త ఏడాదిలోనూ అదే జోరు కొనసాగించింది. ఈ క్రమంలో శుక్రవారం జరిగిన చివరి టీ20లో భారత్ 78 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి మనకు విదితమే. ఇక ఈ ఆటలో ఓపెనర్లు శిఖర్ ధావన్(52), కెఎల్ రాహుల్(54)లు అద్భుతమైన ప్రదర్శనను కనబరిచారు. ఇదిలాఉంటే.. జట్టులో ఉన్న ముగ్గురు ఓపెనర్లు సూపర్ ఫామ్‌లో ఉండటంతో వచ్చే టీ20 వరల్డ్ కప్‌కు ఎవరు ఉంటారు.? ఎవరిపై వేటు పడుతుంది.? అన్న దానిపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. 

అటు ఇదే విషయాన్ని కెప్టెన్ విరాట్ కోహ్లీ దగ్గర కూడా ప్రస్తావించగా అతడు మాట్లాడుతూ..'రోహిత్ శర్మ, ధావన్, రాహుల్‌లు ముగ్గురూ కూడా అద్భుతమైన ఆటగాళ్లు. వారు చక్కటి ఫామ్‌ను కొనసాగిస్తుండటంతో మాకు ఎంపిక చేసుకోవడంలో ఆప్షన్స్ లభిస్తాయని కోహ్లీ తెలిపాడు. కానీ, అభిమానులు మాత్రం తమ ఫేవరెట్ ఆటగాడిని పొగుడుతూ.. మరొకరిని విమర్శించడం కరెక్ట్ కాదని హితవు పలికాడు. ఇదంతా ఒక జట్టు ఆట. ఎవరికి వారు అద్భుత ప్రదర్శనలు ఇచ్చినా.. అన్నీ కూడా జట్టు విజయం కోసమేనని అభిమానులు గుర్తించుకోవాలని కోహ్లీ పేర్కొన్నాడు. అటు శార్దూల్ ఠాకూర్, నవదీప్ సైనీలపై కూడా ప్రశంసలు కురిపించిన టీమిండియా కెప్టెన్.. వారికి మరిన్ని అవకాశాలు దక్కితే అద్భుతమైన బౌలర్లుగా రూపుదిద్దుకుంటారని చెప్పుకొచ్చాడు. కాగా, ఇండియా-ఆస్ట్రేలియా మూడు వన్డేల సిరీస్ మంగళవారం ముంబైలో ప్రారంభం కానుంది.




Tags: rohith rahul kohli shikhar dhawan australia series

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top