logo

ఏపీలో గ్రేడ్-4 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల


12-Jan-2020 12:52IST
release of notification for grade4 posts in ap

ఏపీలోని నిరుద్యోగ యువత కోసం జగన్ ప్రభుత్వం శుభవార్త మోసుకొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా..  గ్రామ సచివాలయాల్లో పంచాయతీ సెక్రటరీ (గ్రేడ్-4) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది . దీనిద్వారా గ్రామ సచివాలయాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 61 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో మండల పోస్టులు 43 ఉండగా.. షెడ్యూలు ప్రాంతాలకు సంబంధించిన పోస్టులు 18 ఉన్నాయి. డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష ద్వారా ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నారు.

పోస్టుల వివరాలు ఇవే:

పంచాయతీ సెక్రటరీ (గ్రేడ్-4) పోస్టులు
ఖాళీల సంఖ్య: 61

అర్హత: డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: 
01.07.2020 నాటికి 18 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.07.1978 - 01.07.2002 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు ఫీజు: 
దరఖాస్తు ఫీజుగా రూ.200, పరీక్ష ఫీజుగా రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. నాన్‌లోకల్ జిల్లాలకు దరఖాస్తు చేసుకునే వారు జిల్లాకు అదనంగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాతపరీక్ష ద్వారా
Related image

Tags: grade-4 posts jobs notification released

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top