logo

రోజూ పెరుగు తింటే కలిగే లాభాలు ఇవే..!


12-Jan-2020 13:25IST
benefits of eating curd daily

చాలా మందికి వారు తినే భోజనంలో పెరుగు లేకపోతే చేసినట్టే ఉండదు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే దానివల్ల అనర్ధాలు ఉంటాయని భయంతో మెుత్తం తినడమే మానేస్తారు. పెరుగు తింటే బరువు పెరుగుతామని,నిద్ర వస్తుందని తినడం మానేస్తారు. నిజానికి పెరుగులో మన శరీరానికి కావాల్సిన పోషకాలు చాలా ఉంటాయి. రోజూ పెరుగు తినడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక భారీగా శక్తి పెరుగుతుంది. పలు అనారోగ్య సమస్యలు కూడా దరి చేరవు. ముఖ్యంగా శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు అందుతాయి. ఈ క్ర‌మంలోనే పెరుగును ఈ సీజ‌న్‌లో రోజూ తింటే మ‌న‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1). పెరుగును రోజూ తిన‌డం వ‌ల్ల జీర్ణ స‌మస్య‌లు ఉండ‌వు. గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతాయి. క‌డుపులో మంట త‌గ్గుతుంది.

2). అధిక బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు త‌మ ఆహారంలో పెరుగును భాగం చేసుకోవాలి.




Image result for curd
3). పెరుగు తినడం వ‌ల్ల ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి.

4). క్యాన్స‌ర్ల‌ను అడ్డుకునే శ‌క్తి పెరుగులోని ఔష‌ధ గుణాల‌కు ఉంద‌ని సైంటిస్టులు చేప‌ట్టిన ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది.

5). పెరుగును రోజూ తిన‌డం వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.



Tags: benefits curd eating daily

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top