logo

ప్రతిష్టాత్మక పాలీ ఉమ్రిగర్ అవార్డుకు జస్‌ప్రీత్ బుమ్రా


12-Jan-2020 13:31IST
indian cricketer jasprit bumrah receive polly umrigar award

భారత్ జట్టు కీలక బౌలర్, డెత్ ఓవర్ల స్పెషలిస్టు అంటే గుర్తు వచ్చే పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా. ఈ ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు సరైన గుర్తింపు లభించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న ప్రతిష్టాత్మక పాలీ ఉమ్రిగర్ అవార్డుకు జస్‌ప్రీత్ బుమ్రా ఎంపికయ్యాడు. జట్టులో అడుగుపెట్టిన కొద్దికాలానికే కీలక పేసర్‌గా మారినాడు బుమ్రా. ప్రస్తుతం వరల్డ్ నం.1 వన్డే బౌలర్‌గా నిలిచాడు. డెత్ ఓవర్ల స్పెషలిస్టుగా తనను పేరు సంపాదించాడు.

బుమ్రా అరుదైన రికార్డులను బ్రమా క్రియేట్ చేశాడు. టీ20ల్లో అత్యధిక వికెట్లు (53) తీసిన భారత బౌలర్‌గా తను నిలిచాడు. అలాగే సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన తొలి ఆసియా బౌలర్‌గా ఘనత సాధించాడు. ఆదివారం జరిగే అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో బుమ్రాకు ఈ అవార్డు అందుకోనున్నాడు.

మహిళల విభాగంలో కూడా పూనమ్ యాదవ్‌కు ఉత్తమ క్రికెటర్‌గా ఎంపికైంది. అయితే.. కొంతకాలంగా అంతర్జాతీయ క్రికెట్లో లెగ్ స్పిన్నర్‌గా తను సత్తాచాటుతోంది. మరోవైపు లెజెండరీ క్రికెటర్లు కృష్ణామాచారి శ్రీకాంత్, అంజుమ్ చోప్రాలకు కల్నల్ సీకే నాయుడు అవార్డుకు ఎంపికయ్యారు. మైదానంలోని ప్రదర్శనలకు గుర్తింపుగా ఈ అవార్డులను అందజేస్తారని బోర్డు చీఫ్ సౌరవ్ గంగూలీ అన్నాడు. మరోవైపు అవార్డుల వేదికపై మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పీచ్ ఇవ్వనున్నాడు.

Tags: indian cricketer jasprit bumrah receive polly umrigar award

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top