logo

డ్రైఫ్రూట్స్ బొబ్బట్లు


12-Jan-2020 13:42IST
dry fruits bobbatlu

ఈ రోజుల్లో డ్రైఫ్రూట్స్ కి విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది దానికి కారణం వాటిలో వుండే పోషక విలువలు చాలా అమూల్యమైనవి. అందుకనే డాక్టర్లు సైతం డ్రైఫ్రూట్స్ తినమని సూచిస్తుంటారు... దాంతో వీటిని ఎక్కువ మంది కొంటున్నారు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందుతున్నారు. రెగ్యులర్‌గా డ్రైఫ్రూట్స్ తీసుకుంటే ఎన్నో లాభాలు పొందొచ్చంటున్నారు పరిశోధకులు. ఫైబర్ గుణాలు ఎక్కువగా కలిగిన డ్రైఫ్రూట్స్ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగ్గా మారుతుందని కొన్ని పరిశోధనలు కూడా నిరూపించాయి. అలాంటి వాటితో బొబ్బట్లు చేసుకొని తింటే ఎలా ఉంటదో తెలుసుకుందాం..! 

 కావలసిన పదార్థాలు: 

మైదాపిండి: 2 కప్పులు, నెయ్యి: 4 టేబుల్‌స్పూన్లు, ఉప్పు: చిటికెడు, జీడిపప్పుపొడి: అరకప్పు, బాదంపప్పు పొడి:అరకప్పు, యాలకులపొడి: టీస్పూను, బెల్లం తురుము: అరకప్పు, అంజీర్‌ పేస్టు: పావుకప్పు, ఎండుకొబ్బరి తురుము: 2 టీస్పూన్లు

తయారుచేసే విధానం: 
ముందుగా మైదాపిండిని శుభ్రం చేసుకోవాలి. ఓ గిన్నెలో మైదా, ఉప్పు, టీస్పూను నెయ్యి వేసి సరిపడా నీళ్లతో చపాతీపిండిలా కలిపి ఓ గంటసేపు నాననివ్వాలి. వేరే గిన్నెలో జీడిపప్పుపొడి, బాదంపప్పుపొడి, అంజీర్‌ముద్ద, ఎండుకొబ్బరి తురుము, యాలకులపొడి వేసి బాగా కలిపి చిన్న చిన్న ముద్దల్లా చేసుకోవాలి. మైదాపిండిని పూరీల్లా చేసి దాని మధ్యలో కలిపిన జీడిపప్పు, బాదంపొడి మిశ్రమాన్ని ఉంచి అంచులు మూసేసి బొబ్బట్ల మాదిరిగా వత్తాలి. పెనంమీద నుంచి నెయ్యి వేస్తూ రెండువైపులా కాల్చి తీయాలి.





Tags: dry fruits bobbatlu healthy food

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top