logo

పాలీ ఉమ్రిగర్ అవార్డు అందుకున్న బుమ్రా


13-Jan-2020 07:49IST
international cricketers bcci jasprit bumrah

భారత్ జట్టు కీలక బౌలర్, డెత్ ఓవర్ల స్పెషలిస్టు అంటే గుర్తుకు వచ్చే పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా. ఈ ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు సరైన గుర్తింపు లభించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్నందుకు.. ప్రతిష్టాత్మక పాలీ ఉమ్రిగర్ అవార్డు అందుకున్నాడు జస్‌ప్రీత్ బుమ్రా. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) వార్షిక అవార్డుల వేడుకలో అతను ప్రతిష్టాత్మక పాలీ ఉమ్రిగర్, దిలీప్‌ సర్దేశాయ్‌ పురస్కారాల్ని పొందాడు. 2018–19 సీజన్‌కు సంబంధించిన వేడుకను ఆదివారం రాత్రి ఇక్కడ నిర్వహించారు. ఈ పురస్కారంలో భాగంగా అతనికి ప్రశంసా పత్రం, ట్రోఫీతో పాటు రూ. 15 లక్షల చెక్‌ అందజేశారు. ఇక దిలీప్‌ సర్దేశాయ్‌ పురస్కారాన్ని టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌కు ఇస్తారు. 

జట్టులో అడుగుపెట్టిన కొద్దికాలానికే కీలక పేసర్‌గా మారినాడు బుమ్రా. ప్రస్తుతం వరల్డ్ నెం.1 వన్డే బౌలర్‌గా నిలిచాడు. డెత్ ఓవర్ల స్పెషలిస్టుగా తనను పేరు సంపాదించాడు. బుమ్రా అరుదైన రికార్డులను బ్రమా క్రియేట్ చేశాడు. టీ20ల్లో అత్యధిక వికెట్లు (53) తీసిన భారత బౌలర్‌గా తను నిలిచాడు. మరోవైపు కొన్ని అరుదైన రికార్డులు బుమ్రా పేరిట ఉన్నాయి. అలాగే సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన తొలి ఆసియా బౌలర్‌గా ఘనత సాధించాడు. 

దీంతో 34 వికెట్లు తీసిన బుమ్రానే ఈ అవార్డు వరించగా, ట్రోఫీ, రూ. 2 లక్షల చెక్‌ చేజిక్కించుకున్నాడు. మహిళల విభాగంలో ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్‌గా పూనమ్‌ యాదవ్‌ పురస్కారం గెల్చుకుంది. గత సీజన్‌లో పూనమ్‌ భారత్‌ తరఫున 8 వన్డేల్లో 14 వికెట్లు, 15 టి20 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు తీసింది. అలనాటి పరుగుల యంత్రం, బ్యాటింగ్‌ దిగ్గజం కృష్ణమాచారి శ్రీకాంత్‌కు కల్నల్‌ సీకే నాయుడు జీవిత సాఫల్య పురస్కారం లభించింది. ప్రశంసా పత్రం, ట్రోఫీ, రూ. 25 లక్షల చెక్‌ ప్రదానం చేశారు. 

టెస్టుల్లో అత్యధిక పరుగులు (52.07 సగటుతో 677) చేసిన చతేశ్వర్‌ పుజారా బ్యాటింగ్‌ కేటగిరీలో దిలీప్‌ సర్దేశాయ్‌ అవార్డు పొందాడు. ట్రోఫీ, రూ. 2 లక్షల చెక్‌ అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో గొప్పగా అరంగేట్రం చేసిన మయాంక్‌ అగర్వాల్‌కు ఉత్తమ అరంగేట్రం క్రికెటర్‌ అవార్డు కింద ట్రోఫీతో పాటు రూ. 2 లక్షలు దక్కాయి. ఈ అవార్డు వేడుకలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్  సహా దిగ్గజాలు, మాజీ క్రికెటర్లు, రంజీ ఆటగాళ్లు పాల్గొన్నారు.

Tags: international cricketers bcci jasprit bumrah

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top