logo

కెరీర్‌లోనే గుర్తిండిపోయే పాట... మైండ్ బ్లాక్ ఖాయం


13-Jan-2020 13:11IST
mind block song in my career mahesh babu

సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు బాక్సాఫీస్ వద్ద రచ్చచేస్తోంది. తొలి రోజే ఈ సినిమాకి అన్ని చోట్ల నుంచి పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లలోనూ దుమ్ములేపుతోంది సరిలేరు నీకెవ్వరు. ఇక ఈ మూవీకి బ్లాక్ బాస్టర్ టాక్ రావడంతో.. చిత్ర యూనిట్ ఆదివారం సక్సెస్‌ మీట్‌ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రిన్స్ మహేష్ బాబు సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ.. మైండ్ బ్లాక్ సాంగ్ తన కెరీర్‌లోనే గుర్తిండిపోయే పాటగా మిగిలిందని అన్నారు.

‘‘నా 20ఏళ్ల కెరీర్‌లో ఒక పాటకు ఇన్ని పొగడ్తలు ఎప్పుడూ రాలేదన్నారు. మైండ్ బ్లాక్ పాట నా కెరీర్‌లో గుర్తుండిపోతుందని, ఈ పాటకు నాతో స్టెప్పులు చేయించిన శేఖర్ మాస్టార్, దర్శకుడు అనిల్ రావిపూడికి థ్యాంక్స్ మహేష్ చెప్పారు. సరిలేరు నీకెవ్వరును హిట్ చేసి, గుర్తుండిపోయే విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు నా థ్యాంక్స్’’ అంటూ మహేష్ బాబు అన్నారు. ఇక డాంగ్ డాంగ్ పాటలో కూడా మహేష్ అదరగొట్టారని అభిమానులు అంటున్నారు. మొత్తానికి మహేష్ బాబు డ్యాన్స్‌ను ఇన్నిరోజులు మిస్ అయిన ఆయన అభిమానులు ఈ పాటలతో తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

Read latest Movies News and Telugu News  Follow us on FacebookTwitter

Tags: mind block song mahesh babu sarileru neekevaru

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top