logo

భారీ లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు


13-Jan-2020 17:20IST
stock markets ending in huge profits

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాల్లో ముగిసాయి. అమెరికా-ఇరాన్‌ మధ్య యుద్ధమేఘాలు చల్లబడటంతో అంతర్జాతీయ మార్కెట్లలో ఉత్సాహం నెలకొంది.  దేశీయంగా స్టాక్‌మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ఆరంభించిన ట్రేడింగ్ మధ్యాహ్నం సెషన్ తరువాత షేర్ల కొనుగోళ్ల వైపు మదుపరులు మొగ్గు చూపడంతో మార్కెట్లు భారీగా పుంజుకున్నాయి. దాంతో సూచీలు భారీగా లాభాల బాట పట్టాయి. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 260 పాయింట్ల లాభంతో 41860 వద్ద ముగిసింది. నిఫ్టీ 73 పాయింట్ల లాభంతో 12330 వద్ద ముగిసింది. త్రైమాసిక ఫలితాల ప్రభావంతో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ షేర్ల ధర ట్రేడింగ్ ముగిసే సమయానికి 4శాతం పైగా లాభానికి చేరుకుంది. ఎన్ఎస్ఈలో ఇన్ఫోసిస్, ఇండస్ఇండ్ బ్యాంకు, కోల్ ఇండియా, గెయిల్, భారతీ ఎయిర్టెల్ షేర్లు లాభాల బీవతలో ప్రయాణించాయి. అమెరికా డాలరుతో ఇండియా రూపాయి మారకం విలువ 70.82 వద్ద కొనసాగుతోంది.


Related image

Tags: stock markets sensex ending in huge profits

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top