logo

తగ్గిన బంగారం ధర


13-Jan-2020 19:25IST
good news for gold lovers  reduced gold price

పసిడి ప్రియులకు శుభవార్త..! ఇటీవలే సామాన్యులకు అందనంత పైకి వెళ్లిన పసిడి ధరలు తాజాగా కిందకు దిగి వస్తున్నాయి. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గు ముఖం పట్టడంతో పసిడి ప్రియులకు నేడు ఈ వార్త శుభవార్తగా నిలిచింది. నేడు హైద్రాబాద్ నగరంలో 10 గ్రాముల బంగారం ధర రూ.41,460 ధరకు పడిపోయింది. అంటే 6 రోజుల్లో ఏకంగా రూ.1,400 తగ్గింది. సోమవారం నాటి బంగారం ధరలు చూస్తే హైదరాబాద్‌లో 24 క్యారట్ బంగారం 10 గ్రాముల ధర ఏకంగా రూ.600 తగ్గింది. రూ.42,060 నుంచి రూ.41,460 ధరకు దిగొచ్చింది. ఇక 24 క్యారట్ బంగారం 10 గ్రాముల ధర రూ.200 తగ్గింది. ప్రస్తుత ధర రూ.38,010. న్యూ ఢిల్లీలో బంగారం ధర రూ.236 తగ్గింది. ప్రస్తుతం న్యూ ఢిల్లీలో 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.40,432. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 1,550 డాలర్లు.

పసిడి మాత్రమే కాదండోయ్ నేనేం తక్కువంటూ.. వెండి ధరలు కూడా కిందికి దిగొస్తున్నాయి. జనవరి 8న హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.51,000 ఉంటే జనవరి 13న కిలో వెండి రూ.49,000 ధరకు దిగొచ్చింది. అంటే ఆరు రోజుల్లో రూ.2,000 తగ్గింది. న్యూ ఢిల్లీలో కిలో వెండి ధర రూ.376 తగ్గి రూ.47,635 ధరకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ వెండి ధర 17.97 డాలర్లు. ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు కాస్త తగ్గడం, రూపాయి బలపడటం లాంటి కారణాలతో బంగారం, వెండి ధరలు కాస్త కిందికి దిగుతున్నాయి. నేడు మార్కెట్లో అమెరికా డాలరుతో ఇండియా రూపాయి మారకం విలువ 70.82 వద్ద కొనసాగుతోంది.






Related image

Tags: good news gold lovers reduced gold and silver price

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top