logo

రియల్‌మీ ఫోన్ వినియోగదారులకు శుభవార్త..!


13-Jan-2020 20:58IST
good news for realm phone users

రియల్‌మీ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు శుభవార్త.  ప్రస్తుతం వినియోగదారులు ఉపయోగిస్తున్న రియల్‌మీ ఫోన్లన్నీ కలర్ ఓఎస్‌తో పనిచేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలో ఇందులో ఉండే కలర్ ఓఎస్ నచ్చనివాళ్లు రియల్‌మీ ఫోన్లు కొనేందుకు వెనుకాడడంతో ఇట్టి విషయాన్ని గమనించిన రియల్‌మీ సంస్థ అందరిని ఆకట్టుకునేందుకు రియల్‌మీ సొంతంగా యూజర్ ఇంటర్‌ఫేస్-(UI)ని రూపొందించింది. ఈ యూఐ తమ వినియోగదారులకు స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియెన్స్ అందించేలా కంపెనీ చెబుతోంది. 

ఐకాన్స్ కస్టమైజేషన్, ప్రకృతిని తలపించే వాల్ పేపర్స్, పర్సనల్ ఇన్ఫర్మేషన్ ప్రొటెక్షన్ ఫీచర్ లాంటి ప్రత్యేకతలు రియల్‌మీ యూఐలో పొందుపరిచారు. మామూలుగా స్క్రీన్ షాట్ తీసుకోవడానికి మూడు వేళ్లతో స్క్రీన్‌పైన స్వైప్ చేయడం అలవాటు. కానీ... రియల్‌మీ యూఐలో జస్ట్ మూడు వేళ్లతో హోల్డ్ చేస్తే చాలు... స్క్రీన్‌షాట్ వచ్చేస్తుంది. ఇక మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయిన కాల్ హిస్టరీ, కాంటాక్ట్స్, మెసేజెస్‌కు ప్రొటెక్షన్ కూడా లభిస్తుంది. ఇప్పటికే కొన్ని ఫోన్లకు రియల్‌మీ యూఐ రిలీజ్ అయింది. మరి ఎప్పుడెప్పుడు ఏఏ ఫోన్లకు రియల్‌మీ యూఐ అప్‌డేట్ వస్తుందో తెలుసుకుందాం.

2020 జనవరి- రియల్‌మీ 3 ప్రో, రియల్‌మీ ఎక్స్‌టీ
2020 ఫిబ్రవరి- రియల్‌మీ ఎక్స్, రియల్‌మీ 5 ప్రో
2020 మార్చి- రియల్‌మీ ఎక్స్‌2, రియల్‌మీ ఎక్స్2 ప్రో
2020 ఏప్రిల్‌- రియల్‌మీ 3, రియల్‌మీ 3ఐ
2020 మే- రియల్‌మీ 5, రియల్‌మీ 5ఎస్2020 జూన్- రియల్‌మీ 2 ప్రో
2020 జూలై నుంచి సెప్టెంబర్ మధ్య- రియల్‌మీ సీ2


Image result for realme ui

Tags: good news realme smart phone users android 10 based realme-ui

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top