logo

వాటర్ బోర్డులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికెషన్


13-Jan-2020 21:10IST
release of notification for the replacement of 185 jobs on the water board

దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగుల శాతాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే చాలా రంగాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికెషన్స్ విడుదల చేస్తున్న కేంద్ర ప్రభుత్వం. తాజాగా  భారత అణుశక్తి విభాగానికి చెందిన హెవీ వాటర్ బోర్డు-HWB ఖాళీలను భర్తీ చేసేందుకు నిర్ణయించుకుంది. స్టైపెండరీ ట్రైనీ, టెక్నికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ నేపథ్యంలో వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. మొత్తం 185 ఖాళీలున్నాయి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 జనవరి 31 చివరి తేదీ. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. https://hwb.mahaonline.gov.in/ వెబ్‌సైట్‌లో ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు

వివరాలు ఇలా ఉన్నాయి: 

మొత్తం ఖాళీలు- 185

టెక్నికల్ ఆఫీసర్ డీ- 28
కెమికల్- 21
మెకానికల్- 3
ఇన్‌స్ట్రుమెంటేషన్- 2సివిల్- 2
స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ 1 పోస్టులు- 65
కెమికల్- 43
మెకానికల్- 1
ఎలక్ట్రికల్- 7
ఇన్‌స్ట్రుమెంటేషన్- 9
కెమిస్ట్రీ (ల్యాబరేటరీ)- 5
స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ 2 పోస్టులు- 92
ప్రాసెస్ / ప్లాంట్ ఆపరేటర్- 56
కెమిస్ట్రీ (ల్యాబరేటరీ)- 2
ఎలక్ట్రికల్- 4
మెకానికల్ (ఫిట్టర్)- 1
మెకానికల్ (మోటార్ వెహికిల్)- 1
వెల్డర్- 8
రిగ్గర్- 8
టర్నర్- 2
ప్లంబర్- 3
మేసన్- 2
కార్పెంటర్- 1
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 జనవరి 11
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జనవరి 31
విద్యార్హత- టెక్నికల్ ఆఫీసర్ పోస్టుకు సంబంధిత విభాగంలో బీటెక్ లేదా బీఈ 60 శాతం మార్కులతో పాస్ కావాలి. స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ 1 పోస్టుకు సంబంధిత విభాగంలో డిప్లొమా 60 శాతం మార్కులతో పాస్ కావాలి. స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ 2 పోస్టుకు ఇంటర్ 60 శాతం మార్కులతో పాస్ కావాలి.
దరఖాస్తు ఫీజు- రూ.100






Image result for hwb

Tags: notification release replacement of 185 jobs water board

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top