logo

సంక్రాంతి స్పెషల్: స్వీట్ పొంగల్


13-Jan-2020 21:58IST
sankranthi special sweet pongal

భారాతీయులు జరుపుకునే పండుగలలో పొంగల్ పండుగని చాలా ఇష్టంగా జరుపుకుంటారు. ఈ పండుగను మూడు లేదా నాలుగు రోజుల పాటు అత్యంత ఉత్సాహంగా బంధుమిత్రులతో కలిసి కన్నుల పండుగల చేసుకుంటారు. తమిళీయులకు కూడా ఈ పండుగను అత్యంత ముఖ్యమైన దానిగా భావిస్తుంటారు. ఈ పండుగ రోజున ప్రత్యేకంగా స్వీట్ పొంగల్ ను వండి ఇంట్లోని వారికి, బంధువులకు వడ్డిస్తారు. పొంగల్ అనేది సౌత్ ఇండియాలో సెలబ్రేట్ చేసుకొనే ఒక పెద్ద పండుగ. నార్త్ ఇండియాలో ఈ పండుగను మకర సంక్రాంతిగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ పండుగ పర్వదినానా ఒక వెరైటీ స్పెషల్ ఫుడ్ ను తయారుచేసుకుంటారు మరియు పొంగల్ చాలా సాధారణ రిసిపి. అలాగే దీన్ని తయారు చేయడం కూడా సులభం. కారం పొంగల్ లాగే స్వీట్ పొంగల్ కూడా చాలా సింపుల్ గా, త్వరగా తయారుచేయవచ్చు. ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ రోజున ప్రతి ఇంట్లోనూ ఈ స్వీట్ పొంగల్ పొంగాల్సింది. మరి దీన్ని ఎలా తయారుచేయాలో తెలుసుకుందామా..!

కావాల్సిన పదార్థాలు: 
బియ్యం నూక - 2 cups 
పెసరపప్పు - 1 cup 
కొబ్బరి తురుము - 1 cup 
బెల్లం - 1 cup
యాలకలు - 2 to 3 
నెయ్యి - 1 cup
ద్రాక్ష - 1/2 cup 
జీడిపప్పు - 1/2 cup 

తయారుచేయు విధానం: 
1. ముందుగా పాన్ తీసుకొని అందులో పెసరపప్పు వేసి 5నిముషాలు ఫ్రైచేసుకోవాలి. 
2. తర్వాత ప్రెజర్ కుక్కర్ తీసుకొని వేయించుకొన్న పెసరపప్పును అందులో వేసి సరిపడా నీళ్ళు పోయాలి. 
3. కుక్కర్ మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి. 
4. అంతలోపు, బీటన్ రైస్(బియ్యం నూక) తీసుకొని శుభ్రంగా కడిగి 
15నిమిస్తాలు పక్కన పెట్టుకోవాలి. 
5. ఇప్పుడు మరో పాన్ తీసుకొని అందులో నీళ్లు పోసి బాగా మరిగించాలి. అందులోనే బెల్లం కూడా వేసి బెల్లం కరిగే వరకూ ఉడికించాలి. మద్యమద్యలో కలియబెడుతుండాలి. సంక్రాంతి మొదటి రోజు 'భోగి’ భాగ్యాల విశిష్టత 
6. ఇప్పు చిన్న పాన్ మరో స్టౌ మీద పెట్టి, నెయ్యి వేసి అందులో ద్రాక్ష మరియు జీడిపప్పు వేసి లైట్ గా బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించుకోవాలి. 
7. 15నిముషాల తర్వాత బెల్లం ఉడుకుతున్న పాన్ లో నానబెట్టుకొన్న బియ్యంను మరియు ముందుగా ఉడికించిన పెసరపప్పు వేసి మెత్తగా ఉడికించుకోవాలి. 
8. మెత్తం మిశ్రమం మెత్తగా ఉడికే సమయంలో నెయ్యిలో వేయించి పెట్టుకొన్న ద్రాక్ష యాలకలు మరియు జీడిపప్పు అందులో వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేసుకోవాలి. అంతే వేడి వేడిగా రుచికరమైన స్వీట్ పొంగల్ రిసిపి రెడీ.




Image result for sweet pongal recipe

Tags: sankranthi special sweet pongal

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top