logo

బాల‌య్య‌తో మ‌ళ్లీ జోడీ క‌డుతున్న న‌య‌న‌


13-Jan-2020 23:49IST
nayanatara again pair with balakrishna

సింహా, లెజండ్‌ చిత్రాలనంతరం బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రంలో హీరోయిన్‌గా నయనతారను ఎంపిక చేస్తున్న‌ట్టు ఫిలింన‌గ‌ర్‌లో టాక్‌. బోయపాటి దర్శకత్వంలో తులసి, సింహా చిత్రాల్లో నటించిన నయన.. బాలయ్యతో సింహా, శ్రీరామరాజ్యం, జైసింహా లాంటి సూప‌ర్ హిట్‌ చిత్రాల్లో నటించింది. ఇటీవల చిరంజీవితోనూరజనీకాంత్‌తోనూ క‌ల‌సి న‌టించిన న‌య‌న‌తార బాలయ్య చిత్రానికి క‌థ‌కూడా విన‌కుండానే సై చెప్పిందంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. 

మ‌రోవైపు ఈ సినిమాలో న‌టించాల్సి ఉన్న రెండో హీరోయిన్‌ను సైతం ఫైనలైజ్‌ చేశారని, ఈ వారంలోనే ఇద్దరు హీరోయిన్ల పేర్లు ద‌ర్శ‌కుడు వెల్లడించనున్నారని తెలుస్తోంది.


కాగా వినయ విధేయరామతో బోయపాటి, రూలర్‌తో బాలయ్య హిట్ కోసం ప్ర‌య‌త్నించిన బాక్సాఫీస్ ముందు చ‌తికిల్ల బ‌డ్డారు. దీంతో ఈ తాజా సినిమాపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తు, హీరోయిన్ల విషయంలో కాంప్రమైజ్‌ అవ్వకూడదని డిసైడ్‌ అయ్యారని, అందులో భాగంగానే నయనతార, సెకెండ్‌ హీరోయిన్‌గా కూడా ద‌క్షిణాదికి చెందిన ఓ క్రేజీ హీరోయిన్‌ను ఎంపిక చేయనున్నారని తెలుస్తోంది!!

Tags:

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top