logo

మంచివాడు క‌ళ్యాణ్ రామ్‌తో ఇంట‌ర్వూ


14-Jan-2020 00:45IST
interview with kalyan ram

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ది ఓ ప్ర‌త్యేక స్టైల్‌. ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టి న‌నాటి నుంచి అతనొక్కడే, 118 ఇలా వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తునే ఉన్నాడు. విజ‌యాలు, ప‌రాజ‌యాలుఎన్ని వ‌చ్చినా త‌న మార్కులోనే వ‌రుస చిత్రాలు న‌టిస్తున్న నందమూరి కల్యాణ్‌రామ్‌ తాజాగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఎంత మంచివాడవురా చిత్రంలో న‌టిస్తున్నాడు. ఈ నెల 15న విడుద‌ల‌వుతున్న ఈ చిత్రాన్ని ఆడియో రంగంలో అగ్రగామి గా వెలుగొందుతున్న   ఆదిత్యా మ్యూజిక్‌ సంస్థ తొలిసారిగా చిత్రం నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టి.. ఆదిత్యా మ్యూజిక్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 


ఉమేష్‌ గుప్తా, సుభాష్‌ గుప్తా నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ ఈ చిత్రానికి శ్రీదేవి మూవీస్‌ శివలెంక కృష్ణప్రసాద్‌ సమర్పకుడు. శతమానం భవతి' చిత్రంతో జాతీయ పురస్కారాన్ని గెలుచుకున్న సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి నాడు విడుద‌ల చేస్తున్న సందర్భంగా జ హీరో నందమూరి కల్యాణ్‌రామ్‌ మీడియాతో ముచ్చటించారు!


అస‌లు ఈ చిత్రాన్నికి ఎంత మంచి వాడ‌వురా టైటిల్ ఎలా పెట్టారు?

తాత‌గారు ఎన్టీఆర్ న‌టించిన నమ్మిన బంటు సినిమా పాట లోని ఆరంభ పదాలే ఈ చిత్రానికి టైటిల్‌ను తీసుకున్నాం. కధాప‌రంగా కూడా ఈ టైటిల్ స‌రైన‌ది. హీరో తను చుట్టూ జరిగే పరిస్థితులను చెడుగా తీసుకోకుండాప్ర‌తి విష‌యంలోనూ పాజిటివ్‌నెస్‌ను చూస్తూ ఉంటాడు ఈ పాయింట్ చుట్టూనే సినిమా ఉంటుంది. ముందు ఆల్‌ ఈజ్‌ వెల్‌ అనే టైటిల్‌ను ప‌రిశీలించాం. కానీ శ‌త‌మానం భ‌వితి త‌ర‌హాలో తెలుగుద‌నం ఉండాల‌ని భావించిన ద‌ర్శ‌కుడు సతీశ్ ని ఈ సినిమాకు కూడా తెలుగు టైటిల్ పెట్టాల‌ని కోరా. మనుషులంతా మంచోళ్లే.. కానీ ప్రతి ఒక్కరూ ఎవ‌రి వైపు నుంచి వాళ్లు తాము మంచివాళ్లే అనుకుంటారు. కాకపోతే కొందరు ఇంకొద‌ర్ని హ‌ర్ట్‌చేస్తుంటారు. ఇలా వారు చేసే తప్పును వాళ్లకి చెప్పాలన్న ప్ర‌య‌త్న‌మే మా సినిమా కాన్సెప్ట్‌. అందుకే ఎంత మంచివాడవురా అనే టైటిల్ అయితేనే జ‌స్టి ఫై అవుతుంది.

మంచితనం స‌రే... సినిమాలో నెగిటివ్‌ టచ్‌ ఎలా ఉండ బోతోంది?

మీర‌న్న‌ది నిజ‌మే... మా ద‌ర్శ‌కుడు తీసిన శతమానం భవతి ఓ ఇంట్లోని ఇద్దరు పెద్ద వ్యక్తులకు సంబంధించిన కథ, ఇక శ్రీనివాస కల్యాణం సినిమా ఓ పెళ్లికి సంబంధించింది. కానీ ఎంత మంచివాడవురా సినిమాలో మాత్రం అనేక మనస్తత్వాలు, భిన్న ఆలోచనలు ఉన్న వ్యక్తుల జీవితాల్లోకి హీరో ఎలా, ఎందుకు వెళ్లాడు అన్న‌ది తెర‌మీదే చూడాలి. ఎందుకంటే ప్రతి వ్యక్తిలో ఓ త‌ర‌హా నెగిటివిటీ ఉంటుంది. దాన్ని హీరో ఎలా దూరం చేసి చూపాడ‌న్న‌దే ఈ సినిమా.


ఈ సినిమా తర్వాత మీకు ఎలాంటి ఇమేజ్ వ‌స్తుంద‌నుకుంటున్నారు?

ఇప్ప‌టి వ‌ర‌కు నేనెప్పుడూ ఇమేజ్‌ గురించి ఆలోచించలేదు. ఆలోచించ‌ను కూడా. రిపీట్‌ కథ, క్యారెక్టర్‌ లేకుండా ఉండేలా చూసుకుంటూ కొత్తగా చూపించాలన్న ప్ర‌య‌త్నంలోనే ఉంటాను. నా సినిమాలు అలానే ఉంటాయి. వాస్త‌వానికి నా 118 సినిమా విడుద‌ల త‌దుప‌రి చాలా మంది ద‌ర్శ‌కుడు, క‌థ‌కులు థ్రిల్లర్‌ కథలు చాలా చెప్పారు. అయితే అందులో చాలా వ‌ర‌కు నాకు న‌చ్చ‌లేదు. కాస్త చిన్నపాటి తేడా ఉన్నా ప్ర‌య‌త్నించే వాడినేమో. కానీ.. కొత్తగా ఏం చేయ‌లేం అనిపించింది. క్యారెక్టర్‌, కథ కొత్తగా ఉండాల‌ని అనేక ర‌కాలుగా ఆలోచిస్తున్న క్ర‌మంలో శతమానం భవతి చిత్రాన్ని చూసిన‌ నా శ్రీమతి చాలా రోజులకి మంచి ఫీల్‌ గుడ్‌ మూవీ చూశాను. ఎప్పుడూ కమర్షియల్‌ సినిమాలేనా, అలాంటి సినిమాలు చేయరెందుకు అని అడిగింది. అలాంటి కథ వచ్చినప్పుడు తప్పకుండా చేస్తా అని చెప్పా. కానీ ఆ చిత్ర ద‌ర్శ‌కుడే మంచి క‌థ‌తో రావ‌టం విశేష‌మ‌నిపించింది.

మీ కెరీర్‌లో చాలా వేగంగా పూర్తి చేసినట్లున్నారే....?

అబ్బే... అదేం కాదు. 118 తర్వాత చాలా కథలు విన్న నాకు ఓ రోజు కృష్ణప్రసాద్‌గారు ఓ గుజరాతీ సినిమా బాగుంది దానిని చూడండి అన్నారు. చూసా... సినిమాలో క‌థాంశాలు బాగున్నాయి. కానీ చాలా సీన్లు మ‌న జ‌నాల‌కి న‌చ్చేలా లేవు. వ‌ర్క‌వుట్ కాద‌నిపించింది. దీంతో ఆ విష‌యం కృష్ణప్రసాద్‌గార్కి చెప్పా. లేదు డైరెక్ట‌ర్ స‌తీష్‌ని పంపిస్తున్నా మీరు కథ వినండి అన్నారు. సరేనని అంటే సతీశ్ ఆ గుజ‌రాతీ సినిమాని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అనుకూలంగా చేసిన మార్పులు చేర్పులు విని ఆశ్చ‌ర్య‌పోయా. ఆ సినిమా ప్రధాన అంశాన్ని ఏమాత్రం చెడ‌గొట్ట‌కుండా సతీశ్‌ ఎంత బాగా మార్చాడో, అంత‌కు మించి క‌థ‌నాన్ని వివ‌రించిన విధానం నాకైతే ఏకంగా షూటింగ్‌లో ఉన్న‌ట్టే  అనిపించింది.


ఈ సినిమాతో స‌మాజానికి ఏమైనా మెసేజ్‌ ఇస్తున్నారా?

ఎంత మంచివాడవురా అంటే తనకు కావాల్సిన రిలేషన్స్ తీసుకుంటూనే ఎదుటివాడికి కావాల్సిన ఎమోషన్స్‌ని ఇవ్వ‌గ‌ల‌గాలి అలాంటి పాత్ర నాది. నాకెరీర్‌లో ఇదో మంచి పాత్ర అని చెప్ప‌గ‌ల‌ను.


ఈ సినిమా క్యారెక్ట‌ర్ మీ నిజ జీవితానికి క‌నెక్ఠ్ అయిన‌ట్టుందే?

అవును మీకు తెలుసుగా మాది ఉమ్మడి కుటుంబం. చిన్నప్పుడు నిత్యం పెద్దమ్మ, పెద్దనాన్న వ‌చ్చేవారు. ఇతర బంధువులు వచ్చినప్పుడు కూడా ఇంకా బాగుండేది. అంతా ఏదో లోకంలోకి వెళ్లి పోయేవాళ్లం. వాళ్లున్నాళ్లు ఇల్లంతా సంద‌డే సంద‌డి. వాళ్లు వెళ్లేటప్పుడు చాలా బాధగా అనిపించేది. ఇంకొన్ని రోజులుండొచ్చు కదా అని అనుకునేవాడ్ని. ఇప్పుడు కూడా మా ఇంట్లో తొమ్మిది మంది ఉంటున్నాం. అంతా పొద్దునే కలిసి మాట్లాడటం అంటే నాకు ఇష్టం. అలాంటి వి ఈ సినిమాలో చాలా ఉన్నాయి. అవన్నీ నా జీవితానికి స‌న్నిహితంగా ఉన్న‌వే కావ‌టం యాధృశ్చికం.


ఇలాంటి పాత్రని మీరు ఛాలెంజింగ్‌గా తీసుకుని చేసిన‌ట్టు అనిపించిందా?

ఇలాంటి పాత్ర చేయడం చాలా ఈజీ అనిచెప్ప‌ను కానీ మా ఇంట్లో ఎలా ఉంటానో అంతే సింపుల్‌గా ఈ క్యారెక్టర్ ఉండ‌టం విశేషం. కోపం కనపడకుండా, నవ్వుతూ కనపడేలా . నా రియల్‌ లైఫ్‌కి దగ్గరగా ఉన్న క్యారెక్టర్ అని చెప్తాను

ఈ సినిమా కోసం షూటింగ్ విశేషాలేంటి?

దాదాపు 70 రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ జ‌రిగింది. టీమ్‌తో మంచి అనుబంధం ఏర్పడింది. ఆ ప్రయాణంలో రోజులు ఎలా గ‌డిచి పోయాయో... అప్పుడే షూటింగ్‌ అయిపోయిందా? అనిపించింది. ముఖ్యంగామున్నార్‌ ప్రాంతాల్లో సెల్‌ ఫోన్‌ సిగ్నల్‌‌ కూడా లేకపోవడంతో సెల్ ఫోన్ల‌న్ని ప‌క్క‌కు పెట్టి, రోజువారీ రొద‌కు దూరంగా ఎంత స‌ర‌దాగా గ‌డిపామో? ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేను. సెల్ ఫోన్ మ‌న వ్య‌క్తిగ‌త జీవితాన్ని ఇంత‌గా హ‌రించేస్తుందా? అనిపించింది ఆక్ష‌ణం. అయినా క‌మ్యూనికేష‌న్ త్వ‌రిత‌గ‌తిన అందాలంటే త‌ప్ప‌దు అందుకే వాడాల్సిందే.


సంక్రాంతికి ఇప్పటికే విడుదలైన మూడు సినిమాలకు తోడుగా మీ సినిమా కూడా రిలీజ్‌ అవుతోందిగా ఎలా ఉండ‌బోతోందంటారు..?

మీర‌న్న‌ది నిజ‌మే... సంక్రాంతి అంటే కేవ‌లం రైతులకు, విద్య‌సంస్ధ‌ల‌కు సెల‌వులొచ్చే పండగే కాదు.. మా సినిమా వాళ్లకు కూడా పెద్ద పండగే. ఫ్యామిలీ అంతా కలిసి సినిమా చూసేది కూడా ఇప్పుడే క‌నుక వ‌రుస‌గా నాలుగయిదు సినిమాలు వ‌చ్చినా ఎప్ప‌టిక‌ప్పుడు స్పేస్‌ ఉంటుంది. పెద్ద బడ్జెట్‌ సినిమాల మ‌ధ్య‌న వ‌చ్చేమీడియం బడ్జెట్‌ సినిమాలు సినిమాలు ప్రేక్ష‌కుల‌ని ఆక‌ట్టుకుంటాయి. ఈ సీజన్‌ను దాటితే ఫ్యామిలీ ఆడియెన్స్ రాక త‌గ్గుతుంది. మళ్లీ వేస‌వి సెల‌వులలో అందరూ థియేటర్‌కు వచ్చే వరకు వెయిట్‌ చేయాలి. దానికి సమయం ఉంది,. మా బడ్జెట్‌లో మాకు వర్కవుట్‌ అవుతుందనే నమ్మకంతో సంక్రాంతికి రావాలని అనుకున్నాం

సతీశ్‌ వేగేశ్నతో ప‌నిచేయ‌టం ఎలా ఉంది.?

బాగుంది పూరి జ‌గ‌న్నాధ్‌, అనిల్‌ రావిపూడితో నేను వ‌ర్క్ చేసేటప్పుడు ఎంత కంఫ‌ర్ట్‌ ఇచ్చారో సతీశ్ కూడా అంతే కంఫర్ట్‌ ఇచ్చి పనిచేయించుకున్నాడు. కాసింత‌ టెన్షన్ క‌నిపించినా... రిలాక్స్ చేసేలా కామెడీ చేస్తూ, వేసే జోకుల‌తో మ‌ళ్లీ మామ్మూలుగా మారి పోయేవాళ్లం.

హీరోయిన్‌ మెహరీన్‌తో ఇబ్బందులేంరాలేదుగా?

ఎందుకొస్తాయి. ఆమె మంచి న‌టి. ఈ చిత్రంలో మెహరీన్ త‌న కందిన పాత్ర‌ని చాలా చ‌క్క‌గా న‌టించింది. . తన పాత్ర అందరికీ కనెక్ట్ అయ్యేలా సాగింది.


ఈ చిత్ర నిర్మాతలకి ఇదే తొలి సినిమా క‌దా? ఆచితూచి వ్య‌వ‌హ‌రించారా?

ఆడియో, వీడియో రంగాల‌లో అగ్రగామిగా వెలుగొందుతున్న‌ ఆదిత్య సంస్థ తొలిసారి నిర్మాణ రంగంలోకి వ‌చ్చిన‌ప్పుడు అంతా ఆశ్చ‌ర్య‌పోయారు. కానీ సీనియర్‌ ప్రొడ్యూసర్‌ శివలెంక కృష్ణప్రసాద్‌గారి చొర‌వ‌, అనుభ‌వం వారికి బాగా క‌ల‌సి వ‌చ్చింది. ఏరోజూ ఖర్చు గురించి ఆలోచించకుండా, ద‌ర్శ‌కుడు కోరుకున్న‌వ‌న్నీ అందించారు. అందుకే సినిమా చాలా బాగా వచ్చిందంటాను. 


సినిమాలోని పాటలకు వస్తున్న రెస్పాన్స్ సంద‌డి చేసేలా ఉందే?

అవును ...త గోపీసుందర్‌గారి మ్యూజిక్‌లో వ‌చ్చిన నిన్ను కోరి సినిమా చూసినప్పుడు ఆత‌నితో ఓ సినిమా చేయాలనుకన్నాను. ఈ సినిమాతో అది తీరింది. పాటలు వినేటప్పుడు కూల్‌గా ఉన్నాయి. వాటిని తెరపై చూస్తున్నప్పుడు ఇంకా బావుంటాయి. ముఖ్యంగా రీరికార్డింగ్‌లో అద్భుతమైన సంగీతం కుదిరింది.

Tags: interview kalyan ram entamanchivadavuraa mehrin sateeh vegnesh

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top