logo

మైన‌ర్ బాలికను నిర్భంధించి మ‌రీ అత్యాచారం


14-Jan-2020 02:29IST
minor girl raped in odissa

బాలిక‌లు, మహిళలు, యువతులపై దాడికి పాల్పడి, అత్యాచారాలు చేసే వారిని శిక్షించేందుకు ప్ర‌భుత్వాలు ఎన్ని చ‌ట్టాలు తెస్తున్నా, పోలీసులు చట్టాలను కఠినంగా అమ‌లు చేస్తు, నిందితుల‌పై ఎంత వ్యవహరిస్తున్నప్పటికీ అత్యాచారాలు ఆగటంలేదు. నిర్భంధం చ‌ట్టం వ‌చ్చిన నాటి నుంచి ఈ అఘాయిత్యాలు మ‌రింత పెరిగి పోయాయి. ఓ వైపు నిందితుల‌కు ఉరి శిక్ష‌లు ప‌డుతున్నా మృగాళ్లు వెర‌వ‌టం లేదు. తాజాగా ఒడిస్సా రాష్ట్రంలో 13 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు దారుణంగా అత్యాచారం చేసిన ఘ‌ట‌న వెలుగు చూసింది. గంజాం జిల్లాలోని బెర్హాంపూర్ లో 8 వతరగతి చదువుతున్న 13 ఏళ్లబాలికను 36 గంటల పాటు నిర్భంధించిన ముగ్గురు యువకులు అత్యాచారం జరిపిన‌ట్టు ఫిర్యాదు అంద‌టంలో పోలీసులు కేసు న‌మోదు చేసి నిందితుల‌ను అరెస్టు చేసి జైలుకు పంపారు.

బెర్హంపూర్ పోలీసు సూపరింటెండెంట్ పినాక్ మిశ్రా అందిస్తున్న వివ‌రాల ప్ర‌కారం బెర్హాంపూర్ శివార్ల‌లో నివాస‌ముంటున్న ఓ బాలిక త‌న తండ్రి చ‌నిపోవ‌టంతో తల్లితో కలిసి అమ్మమ్మ, తాతయ్యల ఇంటికి వ‌చ్చి అక్క‌డే కూలి చేసుకుంటూ కుటుంబానికి ఆదారంగా ఉంటోంది. ఈ క్ర‌మంలో జనవరి 10 వతేదీ సాయంత్రం ఆ బాలిక సంక్రాంతి పండుగ కోసం అవ‌స‌ర‌మైన వ‌స్తువులు, బ‌ట్ట‌లు కొనుక్కునేందుకు మార్కెట్‌కు బ‌య‌లు దేరింది. ఈ క్ర‌మంలోనే ఆమెకు త‌న ఇంటికి ద‌గ్గ‌ర‌లో ఉన్న దనారా అనే కాలేజీలో చదువుకుంటున్న ఓ విద్యార్ధిని తోడుగా రావాల‌ని కోరినా ఆత‌డు నిరాక‌రించి వెళ్లి పోవ‌టంతో చేసేది లేక మార్కెట్‌కి త‌నే బ‌య‌లు దేరింది. అయితే కొంత దూరంవెళ్లాక తన ఇద్దరు మిత్రుల‌తో వ‌చ్చిన ఆ విద్యార్థి, వాహనాల‌పై వ‌చ్చి కలిసి వెళ‌దాంమంటూ బైక్ ఎక్కించుకున్నారు. త‌దుప‌రి మార్గ‌మ‌ధ్యంలో త‌మ మిత్రుడు ఇంటికి వెళ్లి ప‌నిచూసుకుని వెళ్లిపోదామ‌ని సూచించ‌డంతో ఆమె స‌రే అంది. ఆమెను నిర్మానుష్య ప్రాంతంలోని ఓ ఇంటిలోకి తీసుకు వెళ్లి, ఆమెకు మత్తు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చారు. దీంతో ఆమె స్పహ కోల్పోవ‌టంతో వివ‌స్త్ర‌ని చేసి ముగ్గురు స్నేహితులు ఆ బాలిక‌పై సామూహిక అత్యాచారం చేసారు. దాదాపు 36 గంట‌ల పాటు బాలిక‌ను నిర్భంధించి అత్యాచారం చేయ‌టంలో ఆమె పూర్తిగా అపస్మారక స్ధితి కి చేరుకుంది. దీంతో ఆమె మ‌ర‌ణించేలా ఉంద‌ని, ఆమె ఇంటి సమీపంలో పడేసి పారిపోయారు.

ఆమెను గ‌మ‌నించిన బాలిక మేనమామ ఇంట్లోకి తీసుకువెళ్లి స‌ప‌ర్య‌లు చేసి విష‌యం తెలుసుకుని పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు. ఆత‌ని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సునాపూర్ మెరైన్ పోలీసులు స్థానికుల నుంచి స‌మాచారం సేక‌రించి ద‌నారా క‌ళాశాల విద్యార్థిని ప‌ట్టుకుని త‌మ మార్కు విచార‌ణ‌ల‌తో మ‌రి ఇద్ద‌రు నిందితులు దొరికి పోయారు. ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోక్సో చట్టం కింద, ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి మహిళా పోలీసు స్టేషన్ కు బదిలీ చేసారు. బాలికను వైద్యపరీక్షల నిమిత్తం బెర్హాంపూర్‌లోని ఎంకేసిజి మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. ప్ర‌స్తుతం ఆమె పరిస్ధితి నిలకడగా ఉందని ఎంకేసిజి వైద్యులు చెపుతున్నారు. ఆమె పూర్తిగా కోలుకున్నాక స్టేట్ మెంట్ రికార్డు చేసి నిందితులను మెజిస్ట్రేట్ ముందు హాజరు పరుస్తామని పోలీసులు మీడియాకు తెలిపారు.

Tags: minor girl raped odissa

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top