logo

ఆస్ట్రేలియాతో తొలి వన్డే నేడే..


14-Jan-2020 08:11IST
first odi today with australia india

ఆస్ట్రేలియాతో జరిగే మూడు వన్డేల సిరీస్‎కు అత్యుత్తమ ఆటగాళ్లతో బరిలోకి దిగుతోంది టీమిండియా. ఆస్ట్రేలియా-భారత్ వన్డేసిరీస్‌కు సర్వం సిద్ధమైంది. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా ఇరుజట్లు తలపడనున్నాయి. శ్రీలంక మీద టీ20 సిరీస్ విజయం సాధించిన విషయం విదితమే. అయితే అదే ఊపుమీద ఆసీస్ తో మంగళవారం టీమిండియా ఢీకొట్టనుంది. సొంత గడ్డపై వన్డే సిరీస్‌ గెలుచుకోవాలనే పట్టుదలతో ఉంది భారత్ జట్టు. అటూ ఆసీస్ జట్టు కూడా అంతే ధీమాగా భారత్‌ను ఓడించి తీరుతామంటోంది. 

బరిలోకి రోహిత్..టాప్ ఆర్డర్ పై సందిగ్ధత
లంకతో టీ20 సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న ఓపెనర్‌ రోహిత్‌శర్మ.. ఆసీస్‌తో తలపడేందుకు రెడీ అయ్యాడు.  దీంతో టాప్‌ ఆర్డర్‌ బ్యాటింగ్‌పై సందిగ్ధత నెలకొంది. రోహిత్‌, ధావన్‌ ఓపెనింగ్‌ జోడీగా బరిలోకి దిగితే రాహుల్‌ను పక్కన పెడతారా అనే సందేహం వ్యక్తమవుతోంది. అయితే జట్టు అవసరాలను బట్టి తాను బ్యాటింగ్ ఆర్డరులో మార్పులకు సిద్ధమేనని కోహ్లీ తెలిపాడు. బుమ్రా రాకతో జట్టు బౌలింగ్ విభాగం మరింత బలంగా మారనుంది.

ఆస్ట్రేలియా జట్టు కూడా చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుందని భారత్ జట్టు కెప్టెన్‌ కోహ్లీ అన్నారు. ఆసీస్‌తో సిరీస్‌ గెలవడం ఈజీ కాదని.. ఆ టీమ్‌లో మంచి ప్లేయర్స్‌ ఉన్నారన్నారని కోహ్లీ తెలిపాడు. భారత్‌ను ఎదుర్కోవడం ఆస్ట్రేలియా జట్టుకు కూడా కష్టమేనని అభిప్రాయపడ్డాడు. ఈ సిరీస్‌ రసవత్తరంగా సాగడం ఖాయమన్నాడు రన్‌మెషీన్. ఆసీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ ఇవాళ ముంబయిలో జరగనుండగా, రెండోది 17న రాజ్‌కోట్‌లో.. మూడో వన్డే 19న బెంగుళూరులో జరగనుంది.

జట్లు (అంచనా)
భారత్‌: ధవన్‌, రోహిత్‌, రాహుల్‌, కోహ్లీ (కెప్టెన్‌), శ్రేయాస్‌, జాదవ్‌, జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌, కుల్దీప్‌, షమి/సైనీ, బుమ్రా.
ఆస్ట్రేలియా: వార్నర్‌, ఫించ్‌ (కెప్టెన్‌), స్మిత్‌, లబుషేన్‌, హ్యాండ్స్‌కోంబ్‌, కేరీ, ఆస్టన్‌ అగర్‌, కమిన్స్‌, స్టార్క్‌, హాజెల్‌వుడ్‌, జంపా.

Tags: first odi today with australia india

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top