logo

లవ్యూ పవన్ కల్యాణ్ మామా...


14-Jan-2020 08:31IST
pawan kalyan tweets on preti roju pandage

మారుతీ ద‌ర్శ‌క‌త్వంలో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా హీరోహీరోయిన్లుగా గ‌త‌నెల‌లో వ‌చ్చిన‌ ‘ప్రతిరోజూ పండగే’ మంచి హిట్ టాక్ సంపాదించుకోవడంతో పాటు కలెక్షన్ల పరంగా దూసుకెళుతోంది. వరుస పరాజయాలతో నిరాశకు లోనైన సాయితేజ్ కు ‘చిత్రలహరి’ త‌రువాత ‘ప్రతిరోజు పండగే’ విజయంతో మళ్లీ ఊపొచ్చిందనే చెప్పాలి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిచిన ఈ సినిమాకు మెగాభిమానులనే కాకుండా సినీ ప్రేక్ష‌కులు కూడా నీరాజ‌నం ప‌ట్టారు.

తాజాగా ఈ సినిమాని వీక్షించిన పవర్‌స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందిస్తూ.... సాయితేజ్‌కు స్పెషల్ మెసేజ్‌తో శుభాకాంక్ష‌లు చెపుతూ పుష్పగుచ్ఛం పంపిస్తూనే భవిష్యత్తులో నువ్వు నటించే సినిమాలు ఇలాగే మంచి సక్సెస్ అందుకోవాలని ఆశిస్తున్నాన’ అని ట్విట్ట‌ర్‌లో పంపిన‌ సందేశం తో సాయి తేజ్ మ‌రింత హుషారెక్కాడు.

త‌నకు అందిన మేనమామ పంపిన సందేశాన్ని సాయితేజ్ సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ... ‘మీ స్పందనపై మాట్లాడటానికి నాకు మాటలు రావడం లేదు. థ్యాంక్స్ చెబితే అది చాలా చిన్నమాట అవుతుంది. లవ్యూ పవన్ కల్యాణ్ మామా’ అంటూ తన హర్షం వెలిబుచ్చ‌డం విశేషం.

Tags: pawan kalyan sai dharm tej tweets preti roju pandage

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top