logo

బాబు వెంట ఇక‌ ‘బ్లాక్‌ క్యాట్‌’ కమాండోలుండ‌రు..


14-Jan-2020 08:53IST
central govt sucurity cut black cats to babu

తెదేపా అధినేత చంద్రబాబు సహా 13 మంది వీఐపీల రక్షణ బాధ్యతల నుంచి ‘బ్లాక్‌ క్యాట్‌’ కమాండోలను పూర్తిగా ఉపసంహరించాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో తీవ్ర‌వాదు నుంచి ముప్పు ఉంద‌ని ఇప్ప‌టి వ‌ర‌కు టిడిపి అధినేత ‘బ్లాక్‌ క్యాట్‌’ భద్రత పొందుతున్నారు. ఇక‌పై ‘బ్లాక్‌ క్యాట్‌’ భద్రత ఉండదని కేంద్రం స్ప‌ష్టం చేసింది.
ఇప్పటికే దేశంలో 350 మంది ప్రముఖులకు భద్రతను కుదించడం, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు, గాంధీ కుటుంబానికి ప్రత్యేక భద్రతా దళ (ఎస్‌పీజీ) రక్షణను ఉపసంహరించడం వంటి చర్యలను కేంద్రం చేపట్టిన సంగతి తెలిసిందే. ‘బ్లాక్‌ క్యాట్‌’లుగా పిలుచుకునే ఈ దళ కమాండోలు దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రముఖుల రక్షణ విధుల్లో ఉన్న వీరు ప్ర‌స్తుతం 130 మంది ప్రముఖులకు రక్షణ కల్పిస్తున్నాయి.
కాగా తాజాగా జాతీయ భద్రతా దళా (ఎన్‌ఎస్‌జీ)న్ని వీఐపీ రక్షణ విధుల నుంచి వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. ప్రస్తుతం దేశంలో తీవ్ర వాద ముప్పు ఎదుర్కొంటున్న‌ 13 మంది వీఐపీలకు ‘జడ్‌ ప్లస్‌’ భద్రతను ఎన్‌ఎస్‌జీ చూస్తోంది. ఒక్కో ప్రముఖుడికి దాదాపు పాతిక మంది సిబ్బందిని ఎన్‌ఎస్‌జీ కేటాయించింది. వీరిలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, అసోం ముఖ్యమంత్రి శర్వానంద సోనోవాల్‌, మాజీ ముఖ్యమంత్రులు చంద్రబాబు, మాయావతి, ములాయం సింగ్‌, ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌, ఫరూక్‌ అబ్దుల్లా, భాజపా సీనియర్‌ నేత ఎల్‌.కె.ఆడ్వాణీ తదితరులు ఉన్నారు.

Tags: central govt sucurity black cats chandra babu tdp

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top