logo

రేప‌టి నుంచి య‌ధావిధిగా సుప్రభాత సేవ


14-Jan-2020 09:01IST
suprabhata seva continue in tirumala

ప‌విత్రమైన ధనుర్మాసం మంగ‌ళ‌వారం ముగియటంతో బుధ‌వారం నుండి తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ ను రేప‌టి నుంచి పునఃప్రారంభిస్తున్న‌ట్టు టిటిడి ప్ర‌క‌టించింది. గత ఏడాది డిసెంబరు 16వ తేదీ నుంచి ధనుర్మాస ఘడియలు ఆరంభం కావడంతో డిసెంబరు 17వ తేదీ నుంచి శ్రీవారి ఆలయంలో సుప్రభాతం స్థానంలో గోదా తిరుప్పావై పారాయణం చేస్తున్న విష‌యం విదిత‌మే. జనవరి 14వ తేదీ ధనుర్మాస ఘడియలు పూర్తి కావడంతో, జనవరి 15వ తేదీ బుధ‌వారం నుండి యథాప్రకారం శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ నిర్వహిస్తారని తెలిపారు.
అలాగే జనవరి 16వ తేదీన ఉదయం శ్రీవారి ఆలయంలో గోదాపరిణయోత్సవం, మధ్యాహ్నం పార్వేటమండపం వద్ద పార్వేట ఉత్సవం జరుగనున్నాయని టిటిడి ఆ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

Tags: suprabhata seva lord venkateswara tirumala

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top