logo

అమరావతిని రైతుల రక్తంతో తడుపుతోన్న జ‌గ‌న్


14-Jan-2020 09:38IST
Jagan clothed with the blood of Amaravati farmers

మహిళా రైతులు అనే కనికరం కూడా లేకుండా కేసులు, దాడుల‌ దాష్టీకానికి పోలీసులు పాల్ప‌డుతుండ‌టంతో ఆంధ్ర ప్రదేశ్ ప్ర‌జా రాజధాని అమరావతి రైతుల రక్తంతో తడిపేలా జ‌గ‌న్ స‌ర్కారు చూస్తోంద‌ని, నెల్లూరు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆందోళ‌న వ్య‌క్తం చేసారు. నెల్లూరు జిల్లా తెలుగుదేశం కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, అసమర్థత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కార‌ణంగా రాష్ట్రం ఛిన్నా భిన్న‌మైపోతోంద‌ని, . అమరావతిని అంధ కారంలోకి నెట్టేసిన ఘ‌న‌త ఆయ‌న‌దేన‌ని ఎద్దేవా చేసారు.

పీఠాధిపతుల మాటలు విని రైతుల పొట్ట కొట్టేందుకు సిద్ద‌మైన సింఎ విశాఖపట్నం లో ఉండే బాక్స్ సెట్, అల్యూమినియం గనులను దోచుకునే క్ర‌మంలో తాజా ప‌రిస్థితి సృష్టించి మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని మండి ప‌డ్డారు. ప్రస్తుతం అమరావతి పరిసరప్రాంతాలు అంతయు కాశ్మీర్ బార్డర్ లో తలపిస్తుందని, రైతుల పోరాటాలను ఏ పోలీసు వారు ఆపలేరని అన్నారు. చివ‌రికి సంక్రాంతి సందర్భంగా నిర్వహించే ముగ్గుల పోటీలకు కూడా అనుమతి ఇవ్వని పరిస్థితి ఉందంటే వైకాపా ప్ర‌భుత్వం ఎంత అభద్రతా భావం ఉందో అర్థం చేసుకోవచ్చని కోటంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Tags: Jagan blood o amaravati farmers

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top