logo

శ్రీలంకలో ఏడుగురు భారతీయులు అరెస్ట్


14-Jan-2020 11:10IST
arrested seven indians sri Lanka

భారతీయులను శ్రీలంక ఎమ్మిగ్రేషన్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీసా గడువు ముగిసినా తమ దేశంలో ఉన్నారన్న ఆరోపణలపై  ఏడుగురు భారతీయులను శ్రీలంక ఎమ్మిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేశారు. వట్టాలాలో ప్రముఖ నిర్మాణ స్థలంలో కార్మికులుగా పనిచేస్తున్న ఏడుగురు భారతీయులు వీసా గడువు ముగిసింది. దీంతో అక్రమంగా నివసిస్తున్నట్లు ఇమ్మిగ్రేషన్‌, ఎమ్మిగ్రేషన్‌ శాఖ దర్యాప్తు సంస్థ గుర్తించింది. నెల రోజుల బిజినెస్‌ ట్రిప్‌ కోసం శ్రీలంకకు చేరుకున్నారు. గడువు దాటినా కానీ అక్కడే ఉండటంతో పాస్‌పోర్ట్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసేవరకూ వారిని నిర్బంధ కేంద్రాలకు తరలించినట్లు తెలుస్తోంది. వీరంతా దక్షిణాది రాష్ట్రానికి చెందిన వారుగా సమాచారం.

Read latest Inter National News and Telugu News |Follow us on FacebookTwitter 

Tags: arrested five indians sri lanka

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top