logo

టీఆర్ఎస్ నేత ఆత్మహత్యాయత్నం


14-Jan-2020 11:49IST
trs suicide attempt hyderabad

టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం చేసుకోవడం కలకలం రేపింది. బీఫామ్ ఇవ్వలేదనే కారణంతో అభ్యర్థి ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటన మేడ్చల్ లో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. మేడ్చల్ లోని 14వ వార్డుకు విజయ్ అనే వ్యక్తి నామినేషన్ వేయడం జరిగింది. 

అయితే....టీఆర్ఎస్ పార్టీ బీఫామ్ ఇస్తుందనే నమ్మకం పెట్టుకున్నారు. దీంతో అతనికి కాకుండా ఇంకో వ్యక్తికి ఇవ్వడంతో మనస్థాపానికి గురైనాడు. దీంతో అతడు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. దీన్ని గమనించిన స్థానికులు వెంటనే ఆయనను అడ్డుకున్నారు. ఈ ప్రమాదం ఉదయం చోటుచేసుకుంది.

Tags: trs suicide attempt hyderabad

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top