logo

హెడ్ కానిస్టేబుల్‎ను ఢీకొట్టిన కారు, మృతి


14-Jan-2020 12:37IST
car hit constable killed wanaparthy

వనపర్తి జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ ను కారు ఢీకొట్టింది. ఈ ఘటన  వనపర్తి జిల్లా మర్రికుంటలో జరిగింది. మర్రికుంట వద్ద విధులు నిర్వహిస్తున్నాడు హెడ్ కానిస్టేబుల్. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఉన్న తోటి సిబ్బంది సలీం ఖాన్ ను వనపర్తి ఆస్పత్రిలోకి తరలించారు. అయిన  ప్రయోజనం లేకపోయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ హెడ్ కానిస్టేబుల్ ప్రాణాలు విడిచాడు. గుర్తు తెలియని దుండగుడు కారుతో హెడ్‌కానిస్టేబుల్‌ను ఢీకొట్టి పరారీ అయ్యారు. మృతి చెందిన కానిస్టేబుల్‌ సలీంఖాన్‌ శ్రీరంగాపురం పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags: head constable dead road accident wanaparthi

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top