logo

దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం


14-Jan-2020 13:12IST
fire in footwear manufacturing in delhi

దేశ రాజధాని ఢిల్లీలో మరో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ చెప్పుల తయారీ యూనిట్ లో ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన మంగళవారం ఉదయం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఉన్న స్థానికులు ఫైరింజన్ కు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 26 ఫైరింజన్లతో  మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదం జరిగినప్పుడు బిల్డింగ్ లో ఎంతమంది ఉన్నారో ఇంతవరకు తెలియదు పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

గత నెలలో కూడా ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగిన విషయం మనకు తెలిసిందే. స్కూల్ బ్యాగ్ ల ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈఘటనలో 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

Tags: fire delhi footwear manufacturing company

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top