logo

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్


14-Jan-2020 13:41IST
wankhede odi australia win toss elect to bowl india

ఆస్ట్రేలియాతో జరిగే మూడు వన్డేల సిరీస్‎కు అత్యుత్తమ ఆటగాళ్లతో బరిలోకి దిగుతోంది టీమిండియా. ఆస్ట్రేలియా-భారత్ వన్డే సిరీస్‌కు సర్వం సిద్ధమైంది. భారత్‌తో వాంఖడే వేదికగా మంగళవారం జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ అరోన్ ఫించ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో రాత్రి 7 గంటల తర్వాత మంచు కురిసే అవకాశం ఉన్నందువల్ల. టాస్ గెలిచిన అరోన్ ఫించ్ ఛేదనకే మొగ్గు చూపాడు. భారత్ గడ్డపై వన్డేల్లో ఆస్ట్రేలియాదే ఆధిపత్యం. ఇప్పటి వరకూ ఇక్కడ 61 మ్యాచ్‌ల్లో తలపడితే.. 29 మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా, 27 మ్యాచ్‌ల్లో టీమిండియా గెలుపొందింది. మిగిలిన మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. 

శ్రీలంక మీద టీ20 సిరీస్ విజయం సాధించిన భారత్ మంచి ఊపుమీద ఉంది. అదే ఫామ్ తో ఆసీస్‎తో మంగళవారం టీమిండియా ఢీకొట్టనుంది. సొంత గడ్డపై వన్డే సిరీస్‌ గెలవాలనే పట్టుదలతో ఉంది భారత్ జట్టు. ఆసీస్ జట్టు కూడా అంతే ధీమాగా భారత్‌ను ఓడించి తొలి విజయాన్ని సిరీస్ బోణీ కొట్టాలని కసి మీద ఉంది. దీంతో ఇరు జట్లు బలబలాలు సమతుకంగానే ఉన్నాయని చెప్పోచ్చు. అయితే.. ఈ వాంఖడేలో తొలి విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.
జట్లు:
భారత్ జట్టు:  రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, లోకేష్ రాహుల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (కీపర్), రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా

ఆస్ట్రేలియా జట్టు: డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ (కెప్టెన్), మార్నస్ లాబుస్చాగ్నే, స్టీవెన్ స్మిత్, అష్టన్ టర్నర్, అలెక్స్ కారీ (కీపర్), అష్టన్ అగర్, పాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, కేన్ రిచర్డ్సన్, ఆడమ్ జాంపా

Tags: Australia Winning The Toss Choose To Field Ind Vs Aus 1 St Odi

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top