logo

టీడీపీ నేతలకు రోజా కౌంటర్


14-Jan-2020 13:48IST
ysrcp amaravati ap cm jagan

టీడీపీ నేతలకు వైసీపీ ఎమ్మెల్యే రోజా గట్టి కౌంటర్ ఇచ్చారు. అమరావతిపై టీడీపీ నేతలు రాద్దాంతం చేయడం ఎంత వరకు కరెక్ట్ అని ఆమె ఘాటైన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలు ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమ, నారాయణ ధర్నాల్లో ఎందుకు పాల్గొనడం లేదని ఆమె ప్రశ్నించారు. ఈ విషయాన్ని నిజమైన రైతులు గమనించాలని వ్యాఖ్యానించారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు న్యాయం చేసే విధంగా అసెంబ్లీలో సీఎం జగన్‌ ప్రకటన చేయనున్నారని ఆమె స్పష్టం చేశారు. ఏపీని చంద్రబాబు లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ముంచారని ఆమె అన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన చేశారని ఆమె చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం అమరావతిలో తాత్కాలిక నిర్మాణాలే ఎందుకు కట్టిందని ఆమె నిలదీశారు.

Tags: rk roja amaravathi ap cm jagan ysrcp tdp

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top