logo

భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య


14-Jan-2020 13:56IST
husband wife medak dist chegunta  police

మెదక్‌ జిల్లాలో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తను గొడ్డలితో నరికి చంపింది భార్య. ఈ ఘటన చేగుంట మండలం ఇబ్రహీంపూర్‌లో చోటు చేసుకుంది. ఇద్దరి మధ్య కొన్ని రోజుల నుంచి గొడవలు రావడంతో భార్య ఈ దారుణానికి తెగబడింది. ఇక వివరాల్లోకి వెళ్లితే.. పోలీసులు తెలిపిన ప్రకారం మృతుడు భిక్షపతిగా, నిందితురాలిని సత్తమ్మగా పోలీసులు గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ హత్యకు కుటుంబ కలహాలే కారణమని తెలుస్తోంది. కొన్నేళ్ల క్రితం కోడల్ని చంపిన కేసులో సత్తమ్మ జైలుకు వెళ్లి వచ్చింది. మృతుడి నివాసంలో పండగపూట విషాదఛాయలు అలుముకున్నాయి.

Tags: husband wife medak dist chegunta police

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top