logo

మంత్రి పెద్ది రెడ్డి చేసిన చిన్నబుచ్చే ప‌ని ఇది...


14-Jan-2020 19:11IST
minister peddireddy  fire on formers

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏపిలో పేరెన్న‌క‌గ‌న్న మంతి, ప్ర‌స్తుత జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో కీల‌క బాధ్య‌త‌ల‌న్నీ చూసే వ్య‌క్తి ఆయ‌నే. ఆంధ్రాలో మంత్రిగా తెలంగాణలో కాంట్రాక్టరుగా డ్యుయ‌ల్ రోల్ పోషిస్తున్న పెద్దిరెడ్డి శివమాల ధరించి ఈ మ‌ధ్య క‌నిపిస్తున్నారు. తనలో కొండంత మానవత్వం తొణికిసలాడాడుతున్న‌ట్టు క‌నిపించే ఆత‌నిలో ఈ మధ్య శిఖ‌ర స్థాయిలో అస‌హ‌నం ప్ర‌బ‌లి, ఓ కూలిపై దాడి చేయించిన ఘ‌ట‌న‌ల తాజాగా వెలుగు చూసింది. 

ఇందుకు సంబంధించిన వివ‌రాల‌లోకి వెళితే... యాదాద్రి భువనగిరి జిల్లా బస్వాపూర్ పెద్దిరెడ్డి చేప‌ట్టిన జర్వాయర్ కు సంబంధించి భూములను భారీగా తీసుకున్న ప్ర‌భుత్వం ప‌రిహారం చెల్లింపుల‌లో మీన మేషాలు లెక్కిస్తోంద‌ని, రిజ‌ర్వాయ‌ర్ కోసం భూమిని త్యాగం చేసి, అక్క‌డ జ‌రుగుతున్న ప‌నుల్లో కూలీలుగా ప‌నిచేయాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింద‌ని వాపోయారు. 

ఇదే అంశాన్ని ఈ రిజ‌ర్వాయ‌ర్ కాంట్రాక్టు ప‌నులు ప‌రిశీల‌న‌కు వ‌చ్చిన అమాత్యులు పెద్దిరెడ్డి రామ‌చంద్రా రెడ్డి ని క‌ల‌సి విన్నవించేందుకు కొంద‌రు కూలీలను తీసుకుని ఉడుత రవి అనే యువ రైతు వెళ్లాడు. ప‌లు ఆఫీసుల చుట్టూ ఎన్నో ఏళ్లుగా తిరుగుతున్నా పరిహారం అందడంలేద‌ని, ప్ర‌భుత్వానికి చెప్పి త‌మ‌కు ప‌రిహారం ఇప్పించాల‌ని కోరాడు. ఇదే ప్రాంతంలో రైతులుగా హూందాగా గ‌డిపిన తాము . రిజర్వాయర్ పనుల్లో తన కుటుంబీకులతో క‌ల‌సి లేబరుగా ప‌ని చేయాల్సి వ‌స్తెంద‌ని పెద్దిరెడ్డితో మొరపెట్టుకున్నాడు. 


మంత్రిగా వారిని ఊర‌డించాల్సింది పోయి. క‌నీసం మాల‌లో ఉన్నాన‌న్న భావ‌న కూడా లేకుండా త‌ను ఈ పనుల‌కు కాంట్రాక్టరును మాత్ర‌మేన‌ని, పరిహారం మేటరు తనకు సంబంధం లేదంటూ నోటికొచ్చిన‌ట్టు రాయ‌డానికి వీలులేని ప‌దాలు వ‌ల్లె వేసారు. దీనికి తోడు త‌న ముందు ఈ విష‌యం క‌ద‌ప‌డం పాపమన్నట్టుగా శివాలెత్తారు. ఆయన కనుసైగలతో అంగరక్షకులు సైతం రెచ్చిపోయి యువరైతును చిత‌క బాదారు. 


ఇప్పుడు ఈ వార్త తెలంగాణ‌లో సంచ‌ల‌నం సృష్టిస్తోంది. పొరుగు రాష్ట్ర మంత్రి, మ‌న రాష్ట్రంలో త్యాగాల రైతుపట్ల అమానవీయంగా ప్రవర్తించడ‌మేంట‌ని, ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ దౌర్జన్యంపై తెలంగాణ ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుందో చూడాలి. సీఎం కేసీఆర్ ‘పెద్ద’మనసు ఎటు ‘దిక్కు’మొగ్గుతుందో! రైతుల ఆత్మగౌరవంపై దాడి కోణంలో చూస్తారా లేదా? అన్న‌ది చూడాలంటున్నాయి విప‌క్షాలు...

Tags: minister peddireddy ap telangana yadadri formers

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top