logo

టెన్షన్ టెన్షన్ న‌డుమ జ‌న‌సేనాని కాకినాడ పర్యటన


14-Jan-2020 20:10IST
janasena  chief pawan kalyan kakinada tour  tension   tension

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ పర్యటన టెన్షన్ టెన్షన్‌గా మారింది. పవన్ పర్యటన సందర్భంగా కాకినాడలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందంటూ 144 సెక్షన్, 30 యాక్ట్ అమలు చేయ‌టం స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు రోడ్లపై బారీకేడ్లు ఏర్పాటు చేసి ఎవరినీ రానీయడం లేదు. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పండగ వేళ కర్ఫ్యూ వాతావరణం సృష్టించారని విమర్శిస్తున్నారు.

కాకినాడలో ఈ నెల 12న పవన్ కల్యాణ్‌పై ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేసిన అసభ్యకర వ్యాఖ్యలకు నిరసనగా జనసేన కార్యకర్తలు ఆయన ఇంటి ముట్టడికి యత్నించ‌డంతో వైసిపి, జ‌న‌సేన‌ల మ‌ధ్య గొడవ చెలరేగి, చివ‌ర‌కి ఘర్షణకు దారి తీసింది. ఈ ఘటనలో గాయపడ్డ ప‌లువురు కార్యకర్తలను పరామర్శించేందుకు పవన్ కాకినాడ వ‌స్తుండ‌టంతో తుని, ప్రత్తిపాడు వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి, ప్రధాన రహదారులను మూసివేశారు పోలీసులు. తునిలో పది వాహనాలను అడ్డుకుని, అక్క‌డ నుంచి వెన‌క్కి పంపించారు. విశాఖ నుంచి నేరుగా కాకినాడకు చేరుకున్న పవన్. నసేన పార్టీ నాయకుడు నానాజీతో సమావేశమై ప‌రిస్థితి తెలుసుకున్నారు కాకినాడలో ప్రస్తుతం 144 సెక్షన్ అమలు చేయ‌టం. వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన‌ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంటి వద్ద కూడా పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో కాకినాడలో పవన్ పర్యటన ఉద్రిక్త వాతావరణంలో జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ మీడియాలో మాట్లాడుతూ... వైసిపి నేత‌ల‌కు మ‌దం బాగా ఎక్కింద‌ని, అందుకే నోటికి వ‌చ్చిన కూత‌లు కూస్తున్నార‌ని అన్నారు. బలం ఉన్న వాళ్లం కాబట్టే భరిస్తున్నాం. శాంతిభద్రత సమస్యలు సృష్టించాలనుకుంటే మీరెవ్వరూ ఇక్కడ ఉండరు. తెగించి రోడ్ల మీదకు వస్తామ‌ని హెచ్చ‌రించారు. నా సంస్కారం, నా మాట తీరులో నియంత్రణలో ఉన్నాయని, పోలీస్ శాఖ, ఉన్నతాధికారులు, రాష్ట్రాన్ని నడుపుతున్న వ్యక్తులకు చెబుతున్నా.. ఇంకొక్క సంఘటన మాపై జరిగితే మేం చేతులు కట్టుకొని కూర్చోబోమ‌ని అన్నారు. త‌మ వారిపై దాడులు చేసిన వారిపై కేసులు పెట్టాల్సిన పోలీసులు ఘ‌ట‌న‌ల‌కు కార‌కులైన వారికి వంత పాడుతూ భ‌ద్ర‌త క‌లిపిస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. ఘటన వీడియోలతో గవర్నర్‌కు ఫిర్యాదు చేయ‌నున్న‌ట్టు చెప్పారు ప‌వ‌న్‌. వైసీపీ పాలన వస్తే పాలెగాళ్ల రాజ్య, ఫ్యాక్షన్ రాజ్యం వస్తుందని ఆనాడే చెప్పా. ఇలాంటి భాషను గానీ, ప్రజా ప్రతినిధులను గానీ ఎప్పుడూ చూడలేదని చెప్పిన ఆయ‌న ఘ‌ట‌న‌ల‌కు బాధ్యుల‌వుతున్న పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసారు.

Tags: janasena chief pawan kalyan kakinada tour tension dwarapudi

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top