logo

త‌గ్గుతున్నసంక్రాంతి .. సంద‌డి


14-Jan-2020 21:32IST
sankranti festival

తెలుగు ప్రజలు జరుపుకొనే అతిపెద్ద పండుగ సంక్రాంతి. సంక్రాంతి అనగా నూతన క్రాంతి. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణము అంటారు. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంత ప్రజలు ఈ పండుగను నాలుగు రోజులపాటు ఘనంగా జరుపుకొంటారు. భోగి, సంక్రాంతి, కనుమ.. ఇలా మూడు రోజులు ప్రతి ఇంటా సంతోషమే. గ్రామీణ ప్రాంతాల‌లో రైతులకు పంటలు ఇంటికి రావటంతో కొంచెం తీరిక దొరికి సంబరంగా చేసుకునే పంటలకు సంబంధించిన ముఖ్యమైన పండుగగా భావిస్తారు. ధనుర్మాసారంభంతో నెల రోజులు ఆహ్లాధ బ‌రిత వాతావ‌ర‌ణం తెలుగునాట నెల‌కొంటుంది. సంక్రాంతి సంభరాలు చేసుకోవాలని, కనుమతో పండుగకి ఎలా ఎంజాయ్ చేయాలా అని ఇప్పటికే చాలా ప్లాన్స్ వేసేసుకుని స్వ‌గృహాల చేరుకున్న వారంతా గొబ్బెమ్మలు, భోగి మంటలు, గంగిరెద్దులు, పిండి వంటలు, హరిదాసు కీర్తనలు, రథం ముగ్గులు, కోడి పందేలు ఇలా అన్నింటినీ ఆశ్వాదిస్తున్నారు. పగటివేషధారులు, రకరకాల జానపద వినోద కళాకారుల సంకాంత్రి సందడే వేరని చెప్పాలి. . ఈ పండుగకు దాదాపు నెలరోజుల ముందునుంచే – ప్రతీ రోజు తమ ఇళ్ళ ముంగిళ్ళను రంగవల్లులు, గొబ్బెమ్మ లతో అలంకరించ‌డం ప్ర‌త్యేక అంశం.

అయితే రోజులు మారాయి.. రోజులతోపాటు తెలుగు సంప్రదాయాలు కూడా మారుతున్నాయి. కానీ నేడు ఉద్యోగాలు, వ్యాపారాల్లో మునిగితేలుతున్న కారణంగా ఎవరూ ఈ పండుగను పూర్తిస్థాయిలో చేసుకోవడం లేదు. ఒకప్పుడు సంక్రాంతి పండుగ వస్తోందంటేనే జనవరి రెండు మూడు తారీకుల నుంచే సందళ్లు కనిపించేవి, పండగకు పదిరోజుల ముందు నుంచే కొత్త అల్లుళ్ల హడావుడి మొదలై.. పండగ తర్వాత పదిరోజుల వరకు కూడా ఉండేది.. నాలుగు రోజుల పాటు సంక్రాంతి పండుగను జరుపుకునేవారు. భోగీ, మకరసంక్రాంతి అలాగే కనుమ, ముక్కనుమ ఇలా పండుగ జ‌రిగేది. ప్రపంచంలో ఏ మూలన జాబ్ చేస్తున్నా వ్యాపారం చేస్తున్నాకూడా కచ్చితంగా తమ స్వగృహాలకు చేరుకుని కుటుంబసభ్యులతో సంక్రాంతి పండుగను జరుపుకుంటున్నా అది కేవ‌లం మూడు రోజులకే పరిమితం అయిపోయారు. నేడు అంత ఓపిక ఎక్కడా కనిపించడం లేదు. ఫలితంగా తెలుగు సంప్రదాయాల్లో కీలకమైన సంక్రాంతి కుంచించుకుపోయింద‌నే చెప్పాలి.

Tags: sankranti festival

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top