logo

ల‌వ్ స్టోరీ ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌


14-Jan-2020 22:03IST
nagachaitanya love story first look release

ఫిదా, హ్యాపీడేస్, గోదావరి, ఆనంద్ వంటి బ్యూటిఫుల్ లవ్ స్టోరీస్‌ని అందించిన శేఖర్ కమ్ముల తాజా చిత్రానికి ‘లవ్ స్టోరీ’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేయ‌గా. ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ పోస్టర్‌ను నాగ చైతన్య విడుదల చేసారు. ప్రేమ‌క‌ధా చిత్రాల‌కు త‌న‌దైన మార్కు చూపించే శేఖర్ కమ్ముల చైతూకి జోడీగా ఫిదా పోరి సాయి పల్లవి ని ఎంపిక చేసిన రోజునే సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. సంక్రాంతి కానుకగా ఈ మూవీ ఫస్ట్ లుక్, టైటిల్‌ను చిత్ర యూనిట్ విడుదల చేయ‌గా.. దీనిపై నాగ‌చైత‌న్య ట్వీట్ల‌కు రీట్వీట్లు చేసిన స‌మంతా ఈ సినిమాపై ప్ర‌శంస‌లు గుప్పించింది. కాగా ఇ తెలంగాణ యువకుడిగా చైతన్య ఈ సినిమా లో క‌నిపించ‌నున్నాడు. ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తయినట్లు యూనిట్ వ‌ర్గాల సమాచారం.

Tags: nagachaitanya love story first look release

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top