logo

అసదుద్దీన్‌ ఒవైసీపై చర్యలు తీసుకోవాలి


16-Jan-2020 20:50IST
asaduddn vais  punish him

సంగారెడ్డిలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ కోరింది. ఈ మేరకు తెలంగాణ పీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్‌ మర్రి శశిధర్‌రెడ్డి గురువారం ఈసీకి ఫిర్యాదు చేశారు.

 ఎవరు డబ్బులిచ్చినా తీసుకుని ఎంఐఎంకు ఓటేయాలని చెప్పడం ద్వారా ఎన్నికల్లో డబ్బు సంస్కృతిని ప్రోత్సహించేలా మాట్లాడారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.  అలా మాట్లాడటం ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కిందకే వస్తుందని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.Tags: asaduddīn‌ ōvaisī commentes congress leaderes

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top