logo

హీరోయిన్ రష్మిక నివాసంలో రూ.25 లక్షలు స్వాధీనం


17-Jan-2020 16:48IST
it collect 25lakhs rashmika mandanna residence

హీరోయిన్‌ రష్మిక మందన్న ఇంటిపై ఐటీ అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. ఐటీ సోదాల్లో లెక్క తెలని రూ.25 లక్షలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇంటి నుంచి ఐటీ అధికారులు లెక్కలోకి రాని రూ. 25 లక్షలు రాబట్టినటట్లు ఐటీ విభాగం వెల్లడించింది. అంతేకాకుండా వీటితోపాటు విరాజ్‌పేట ప్రాంతంలో ఉన్న రష్మిక ఇంటి కాగితాలను కూడా వారు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అయితే..సంక్రాంతి పండగ రోజున కర్ణాటకలోని  కొడుగు జిల్లాలో ఉన్న రష్మిక నివాసంలో ఆదాయపు పన్ను అధికారులు సోదాలు చేసిన విషయం తెలిసిందే. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న కారణంలో ఈ తనిఖీలు చేపట్టారు.

అయితే..ఆమె ఇంటికి సంబంధించి ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలకు రష్మిక తల్లిదండ్రులు సరిగ్గా జవాబు చెప్పకుండా తడబడటంతో.. అధికారులు ఇంటి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే రష్మిక తల్లిదండ్రుల నుంచి రష్మికా బ్యాంక్‌ ఖాతా వివరాలు, ఆస్తి వివరాలకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలిస్తున్నారు. ఇక కన్నడలో రష్మిక స్టార్‌ హీరోయిన్.. అయిన రష్మిక ఛలో సినిమా ద్వారా తెలుగు వెండితెరకు పరిచయమయ్యారు. తాజాగా రష్మిక- మహేష్‌బాబు కలిసి నటించిన ‘సరిలేరు నీకెవ్వరూ’ చిత్రం బాక్సాఫిస్‌ వద్ద దూసుకుపోతుంది. అలాగే తెలుగు, కన్నడం, తమిళంలో వరుస సినిమాలతో రష్మికా ప్రస్తుతం బిజీ షెడ్యూల్ తో ఉన్నారు.

Tags: it collect 25-lakhs rashmika mandanna residence

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top