logo

5న ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ


03-Jun-2019 12:30IST
army recruitment Rally on 5th

ఒంగోలు: జిల్లాలోని పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్‌లో ఈనెల 5న ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ జరుగుతుందని స్టెప్‌ సీఈఓ డాక్టర్‌ బీ. రవి తెలిపారు. జోనల్‌ రిక్రూట్‌మెంట్‌ ఆఫీస్‌ చెన్నై, ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ఆఫీసు గుంటూరు ఆధ్వర్యంలో వచ్చే నెల 5 నుంచి 15వ తేదీ వరకు ర్యాలీ జరుగుతుంది. సోల్జర్‌ టెక్నికల్‌, సోల్జర్‌ క్లర్క్‌, స్టోర్‌ కీపర్‌ టెక్నికల్‌, సోల్జర్‌ జనరల్‌ డ్యూటీ తదితర విభాగాలకు ఈ రిక్రూట్‌మెంట్‌ జరగనుంది. ఆర్మీ ర్యాలీలో పాల్గొనే అభ్యర్థులు పదవ తరగతిలో గ్రేడ్‌ సిస్టమ్‌ కలిగిన సర్టిఫికేట్‌, మార్కులు జాబితా సర్టిఫికేట్‌ను తీసుకొనిరావాలి. మార్కులు జాబితాలు లేకపోతే ర్యాలీలో అనుమతించరు. ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీలో పాల్గొనే అభ్యర్థులు 17సంవత్సరాల ఆరునెలల నుంచి 23 ఏళ్ల లోపు ఉండాలి. అభ్యర్థులు ఈనెల 16వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను చేసుకోవాలని ఆయన కోరారు.

Tags: army recruitment Rally 5th this month

Advertisement
Advertisement
Top