logo

వివాహితపై సామూహిక అత్యాచారం..


04-Jun-2019 08:55IST
gang rape on married women

ఆలయానికి వెళుతున్న మహిళను అడ్డగించి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఐదుగురు యువకులు. ఈ అత్యాచార ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడంతో వారి గొయ్యి వారే తొవ్వుకున్నట్టు అయ్యింది. ఈ దారుణమైన ఘటన రాజస్థాన్‌లోని పాలి జిల్లాలో జరిగిందీ. పోలీసుల కథనం ప్రకారం గత నెల 26న ఓ వివాహిత తన స్నేహితురాలితో కలిసి ఆలయానికి వెళుతుండగా ఐదుగురు యువకులు వారిని అడ్డగించి వివాహితను బలవంతంగా ఈడ్చుకెళ్లారు. నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో ,మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వీడియో ఆధారంగా నలుగురు నిందితులు జితేంద్ర భట్‌, గోవింద్‌ భట్‌, దినేశ్‌ భట్‌, మహేంద్ర భట్‌ లను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడు సంజయ్‌ భట్‌‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Tags: gang rape married women

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Top