మంత్రాలయం : సరదాగ సాగాల్సిన వేసవి సెలవులు పెను విషాదం మిగిల్చింది.అల్లరు ముద్దుగా పెంచుకున్న ఇద్దరు చిన్నారులు బావిలో పడి మృతి చెందిన ఘటన చెట్నేహళ్లి గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. చెట్నేహళ్లి గ్రామానికి చెందిన చిన్న రాఘవేంద్రగౌడ్, ఉమిదేవి దంపతుల కుమారుడు కార్తీక్గౌడ్(9), అదే ఇంటి ఆడపడచు రాఘమ్మను ఆదోనికి చెందిన గురుపాదప్పకు ఇచ్చి వివాహం చేశారు. వీరి కుమారుడు పెద్ద బసవ (11). 4.45గంటల సమయంలో గ్రామ సమీపంలో ఉన్న ప్రాథమికోన్నత పాఠశాల పక్కనే ఉన్న బావి వైపు చిన్నారులు వెళ్లారు. అక్కడ ఉన్న కొందరికి అనుమానం వచ్చి చూసేవరకు చిన్నారులు కొన ఊపిరితో కొట్టుమిట్టాడటంతో వారిని బయటకి తీసి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అక్కడ దగ్గరలో ఉన్న ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.